
Samantha Injured: స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలం నుండి మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకొని ఈమధ్యనే కోలుకొని షూటింగ్స్ లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.ప్రసుతం ఆమె అమెజాన్ ప్రైమ్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘సీటా డెల్’ అనే చిత్రం లో రా ఏజెంట్ గా నటిస్తుంది.గతం లో ఆమె ఇదే అమెజాన్ ప్రైమ్ సంస్థ తెరకెక్కించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో విలన్ గా నటించి మంచి పాపులారిటీ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో సమంత కి బాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువలాగా వస్తున్నాయి.అలా హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచినా ‘సీటా డెల్’ ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తుంది.ఈమధ్యనే ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్న సమంత పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను గత కొద్దిరోజుల నుండి చిత్రీకరిస్తున్నారు.
అయితే ఈ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయం లో తన చేతికి తీవ్రమైన గాయాలు జరిగాయంటూ సమంత ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.రక్తపు మరకలతో నిండిపోయిన సమంత చేతులను చూసి అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.ఇన్ని రోజులు మృత్యువుతో పోరాడి ఇప్పుడే కోలుకున్నావు.ఇలాంటి సమయం లో రిస్కులు అవసరమా..జాగ్రత్తగా ఉండు, నీకు ఏమైనా అయితే మేము తట్టుకోలేము అంటూ సమంత కి అభిమానులు సోషల్ మీడియా లో చెప్తున్నారు.ఈ సినిమాలో హీరో గా వరుణ్ ధావన్ చేస్తున్నాడు.

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రని, ఇక్కడ సమంత చేస్తుంది.ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తనకి ఎంత మంచి పేరు తెచ్చిందో, ఈ సిరీస్ అంతకు మించి మూడింతలు రెట్టింపు పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడుతుందనే బలమైన నమ్మకం తో ఉంది సమంత.మరి ఆమె నమ్మకం నిజం అవుతుందో లేదో చూడాలి.