Rashmika Mandanna: రష్మికకు సుడి బాగున్నట్టు కనిపించడం లేదు.. ఇప్పుడు తెలుగులో పుష్ప_2 చేస్తోంది..తమిళ్, హిందీ లో కొన్ని పైప్ లైన్ లో ఉన్నాయి.. సొంత పరిశ్రమ కన్నడలో ఆమెను దేకే పరిస్థితులు లేవు.. మొన్న విడుదలైన వారసుడు కన్నడ డబ్బింగ్ సినిమా ఫలితం ఎలా ఉందో చూశాం కదా! వారం గడవక ముందే వేల షోలు రద్దయ్యాయి. దీనికి కారణం రష్మిక నే అని అక్కడ ఎగ్జిబిటర్ల ఆరోపణ.. పైగా కన్నడ సినిమాలు హిట్ అయ్యేసరికి అక్కడి అభిమానులు సైకోలుగా మారుతున్నారు.. ఇతర నటీనటులపై ద్వేష భావాన్ని పెంచుకుంటున్నారు.. ఆ మధ్య కాంతార సినిమా గురించి ఏదో మాట్లాడిందని రష్మిక మీద కన్నడ అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.. ఆ రిషబ్, రక్షిత్ శెట్టి వ్యవహరిస్తున్న తీరు సరే సరి. ఇక ఈమధ్య రష్మిక మీద ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి.. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి.. వీటికి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక ఆమె తెగ బాధపడుతోంది.

ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో రష్మిక ట్రోలర్స్ మీద బరస్ట్ అయిపోయింది. నిజంగానే ఆమె మీద ట్రోలింగ్ ఒక రేంజ్ దాటిపోయింది.. ఆమె ఆ గ్రహంలో ఆవేదన ఉంది. జరుగుతున్న నష్టం ఏమిటో తెలిసి వచ్చి, సరిదిద్దుకునే ప్రయత్నాలేవో చేస్తోంది.. కానీ ట్రోలర్స్ మాత్రం విడిచి పెట్టడం లేదు. నిజంగానే ఆమెను విమర్శించాల్సిన అంశాల్లో కాకుండా… చిన్న చిన్న విషయాల్లో కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నారు.. ప్రత్యేకించి కాంతార సినిమా చూడలేదు అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో… అప్పటి నుంచి మొదలైంది. ఆమె గోక్కుంటూ పోయింది తప్ప ఇండస్ట్రీని, మీడియాను, ట్రోలర్స్ ను ఎలా టాకిల్ చేయాలో ఆలోచించలేదు.. దీంతో మరింత బదనాం అయిపోయింది.
జరగాల్సిన నష్టం జరిగాక…ఇప్పుడు నాకు కిరిక్ పార్టీ లైఫ్ ఇచ్చింది.. రిషబ్ శెట్టే నన్ను మొదట లాంచ్ చేసింది అనే స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల వచ్చేది ఏముంది? కొన్నాళ్ళ పాటు నిశ్శబ్దంగా ఉంటే సరిపోయేది.. కొన్నాళ్ళు గొక్కోడం, తర్వాత గోకించుకోవడం దేనికి? తర్వాత ఇలాంటి అనవసర లేపనాలు పూసుకోవడం ఎందుకు?

ఇప్పుడు రష్మిక తెగ బాధ పడిపోతుంది. కన్నీటి పర్యంతం అవుతోంది..ఇక్కడా తప్పే. మానసికంగా హింసిస్తున్నారు అని బాధపడటం దేనికి? ఆ హింసకు దూరంగా ఉండాలి.. ఇటీవల ఛానల్ ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తపరిచింది. నేను ఊపిరి పీల్చుకున్నా తప్పు పడుతుంటే నేను ఇంకా ఏం చేయాలి అంటూ తెగ బాధ పడిపోతుంది. అసలు ట్రోలర్స్ వాడే భాష,చేసే వ్యాఖ్యానాలు బాధపెడుతున్నాయంటూ కన్నీటి పర్యంతం అవుతోంది. వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి అని అడుగుతోంది. అయితే ఈ రంగుల సినీ పరిశ్రమలో కొందరిలా ఫరమ్, స్టబర్న్ గా ఉండటం నేర్చుకోవాలి. కంగనా రనౌత్ మాదిరి టెంపర్ మెంట్ చూపించాలి. లేకపోతే కేఆర్ కే వంటి థర్డ్ రేట్ విమర్శకులు సైతం పిచ్చిపిచ్చి వ్యాఖ్యానాలు చేస్తారు.. లేదంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మరో ఉత్తమమైన మార్గం.. ఎందుకంటే సోషల్ మీడియా ఎవరినీ ఎవరెస్ట్ ఎక్కించదు.. పసిఫిక్ సముద్రంలో ముంచదు.. అందుకే చేతులు కాలనీయకుండా చూసుకోవాలి.. కాలాక బర్నల్ రాసుకోవాలి.. అంతేకానీ ఏడిస్తే ఇక్కడ ఎవరు కన్నీళ్లు తుడవరు.