Anchor Anasuya Bharadwaj: అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె టాలీవుడ్ బిజీ యాక్ట్రెస్ అయ్యారు. ఏడాదికి నాలుగైదు సినిమాలు విడుదల చేస్తున్నారు. కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అనసూయ ఈ రేంజ్ కి వెళతారని కల్లో కూడా ఊహించి ఉండరు. యాంకర్ గా సక్సెస్ కావడం ఆమె ఫేట్ మార్చేసింది. ఎంబీఏ చదివిన అనసూయ అనేక మిడిల్ క్లాస్ కష్టాలు చూశారు. ఆ బాధల్లో నుండి పుట్టిన కసితో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకున్నారు. దానికి గ్లామర్ ఫీల్డ్ ని ఎంచుకున్నారు. న్యూస్ రిపోర్టర్ గా మొదలైన ఆమె కెరీర్ హీరోయిన్ స్థాయికి చేరింది.

చదువు పూర్తయ్యాక అనసూయ కొన్ని జాబ్స్ చేశారు. అవేమీ ఆమెకు కిక్ ఇవ్వలేదు. మొదటి నుండి ఆమెకు గ్లామర్ ఇండస్ట్రీ పట్ల మక్కువ ఉంది. దీంతో నటిగా, యాంకర్ గా ప్రయత్నాలు చేశారు. మా మ్యూజిక్ ఛానల్ లో అనసూయకు యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ అనుభవం జబర్దస్త్ యాంకర్ గా సెలెక్ట్ అయ్యేందుకు ఉపయోగపడింది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ స్టార్ట్ చేశారు. జబర్దస్త్ ఆడిషన్స్ లో పాల్గొన్న అనసూయ ఎంపికయ్యారు.
అక్కడే ఆమె సక్సెస్ కి బీజం పడింది. జబర్దస్త్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కాగా అనసూయ స్టార్ యాంకర్ అయ్యారు. బోల్డ్ అండ్ గ్లామర్ యాంకర్ గా స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దాదాపు 9ఏళ్లు అనసూయ జబర్దస్త్ యాంకర్ గా ఉన్నారు. గత ఏడాది వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్ మానేశారు. చెప్పాలంటే పూర్తిగా బుల్లితెరను వదిలేశారు. వెండితెర ఆఫర్స్ విరివిగా వస్తున్న తరుణంలో బుల్లితెరకు గుడ్ బై చెప్పేశారు. ఇకపై అనసూయ యాంకర్ గా కనిపించే సూచనలు లేవు.

ప్రస్తుతం అనసూయ చేతిలో పుష్ప 2, రంగమార్తాండ, మైఖేల్ వంటి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. మైఖేల్ లో సైతం అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్నారనిపిస్తుంది. ఇక పుష్ప సీక్వెల్ లో అనసూయ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పుష్ప 2 షూటింగ్ మొదలైంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ నటిస్తున్నారు. రంగమార్తాండలో ఆమెది దేవదాసి రోల్ అని సమాచారం.

ఇక సోషల్ మీడియాలో అనసూయ సంచలనాలు కొనసాగుతున్నాయి. మొహమాటం లేకుండా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా బ్లాక్ టాప్, రెడ్ ఫ్రాక్ ధరించిన సూపర్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టారు. సదరు ఫోటోలకు ఆమె ఇచ్చిన కామెంట్స్ క్రేజీగా ఉన్నాయి. కొత్త ఫీలింగ్స్ కలుగుతున్నాయని అనసూయ చెప్పడంతో ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.