https://oktelugu.com/

Poorna : అయ్యో గర్భం ఏమైంది? ఊహించని షాక్ ఇచ్చిన హీరోయిన్ పూర్ణ!

Poorna : హీరోయిన్ పూర్ణ బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ కొత్త చర్చకు దారితీసింది. బ్లాక్ ట్రెండీ అవుట్ ఫిట్ లో ఉన్న పూర్ణ బేబీ బంప్ లేకుండా కనిపించారు. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ మీరు ప్రెగ్నెంట్ కదా! బేబీ బంప్ ఏమైపోయింది? అని అడుగుతున్నారు. పూర్ణ 2022 ప్రారంభంలో పెళ్లి ప్రకటన చేశారు. దుబాయ్ కి చెందిన షానిద్ అసిఫ్ అలీతో నిశ్చితార్థం జరిగింది. తన నిశ్చితార్థ వేడుక ఫోటోలు పూర్ణ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2023 / 07:35 PM IST
    Follow us on

    Poorna : హీరోయిన్ పూర్ణ బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ కొత్త చర్చకు దారితీసింది. బ్లాక్ ట్రెండీ అవుట్ ఫిట్ లో ఉన్న పూర్ణ బేబీ బంప్ లేకుండా కనిపించారు. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ మీరు ప్రెగ్నెంట్ కదా! బేబీ బంప్ ఏమైపోయింది? అని అడుగుతున్నారు. పూర్ణ 2022 ప్రారంభంలో పెళ్లి ప్రకటన చేశారు. దుబాయ్ కి చెందిన షానిద్ అసిఫ్ అలీతో నిశ్చితార్థం జరిగింది. తన నిశ్చితార్థ వేడుక ఫోటోలు పూర్ణ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

    పెళ్లి మాత్రం రహస్యంగా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ జరిగి నెలలు గడుస్తున్నా పెళ్లి ప్రకటన రాలేదు. దీంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారనే ప్రచారం జరిగింది. షానిద్ తో కలిసి దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి పూర్ణ పరోక్షంగా ఖండించారు. అనంతరం నా వివాహం జరిగిపోయింది. జూన్ 12న దుబాయ్ లో షానిద్ ని పెళ్లి చేసుకున్నానని చెప్పారు.

    ఈ వార్త అభిమానుల మైండ్ బ్లాక్ చేసింది. చడీ చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటని వాపోయారు. కొన్ని అనివార్య కారణాలతో పెళ్ళికి ఎవరినీ పిలవలేదు. కేవలం సన్నిహితుల మధ్య పెళ్లి తంతు ముగిసిందని పూర్ణ వెల్లడించారు. కాగా ఇటీవల పూర్ణ ప్రెగ్నెన్సీ ప్రకటన చేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా తల్లి కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.

    మిల్కీ రోజ్ ఫ్రాక్ ధరించి పూర్ణ బేబీ బంప్ లో ఫోటో షూట్ చేశారు. తన ప్రెగ్నన్సీ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే లేటెస్ట్ ఫోటో షూట్ తో పూర్ణ షాక్ ఇచ్చారు. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి ఆమె కెమెరా ముందుకు వచ్చారు. ఈ ఫొటోల్లో ఆమె గర్భం లేకుండా కనిపించారు. సడన్ గా పూర్ణ బేబీ బంప్ ఏమైందని జనాలు షాక్ అవుతున్నారు. అదే సందేహం కామెంట్స్ రూపంలో ఆమెను అడుగుతున్నారు.

    పూర్ణకు డెలివరీ అయ్యుండొచ్చు అనుకోవడానికేమో… ఆమె సమాచారం ప్రకారం నెలలు నిండలేదు. ఒకవేళ డెలివరీ అయినా… అప్పుడే ఫోటో షూట్స్ చేయరు కదా!. బహుశా ఇది తల్లి కాకముందు చేసిన ఫోటో షూట్ కావచ్చు. కారణం ఏదైనా కానీ బేబీ బంప్ లేకుండా కనిపించి పూర్ణ కొత్త చర్చకు తెరలేపింది. ఇక హీరోయిన్ గా రిటైర్డ్ అయిన పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు.

    Tags