
Raghav Chadha- Parineeti Chopra: హీరోయిన్ పరిణితి చోప్రా పెళ్లి వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చడ్డాను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గుప్పుమంది. ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రణితి చోప్రా-రాఘవ్ చడ్డా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ వార్త తెరపైకి వచ్చింది. పరిణితి చోప్రా-రాఘవ్ చడ్డా ఒకరికొకరు బాగా తెలుసట. వీరి అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయట. దీంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు వచ్చారట.
పరిణితి-రాఘవ్ చడ్డా పేరెంట్స్ కి కూడా వీరి విషయం తెలిసిందట. పెళ్లి విషయంలో ఇరు కుటుంబాల సభ్యులు ఆనందంగా ఉన్నారట. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని వినికిడి. త్వరలో ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి పెళ్లి ప్రకటన చేయనున్నారట. తర్వాత ఎంగేజ్మెంట్ జరగనుందట. పరిణితి-రాఘవ్ చడ్డా తమ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి వాడుక నిర్వహించలేదట.. ఈ మేరకు ప్రముఖంగా కథనాలు వెలువడుతున్నాయి.
పరిణితి చోప్రా అక్క ప్రియాంక చోప్రా సైతం ఇండియాలోనే ఉన్నారు. నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభ కార్యక్రమం కోసం ఆమె అమెరికా నుండి వచ్చారు. దీంతో అక్క ప్రియాంక చోప్రాను కూడా ఈ యువ జంట కలవనున్నారనేది టాక్. పంజాబ్ కి చెందిన ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేతతో పరిణితి చోప్రా వివాహం దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

గతంలో పరిణితి చోప్రా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ… ఎవరినైనా చేసుకుంటాను కానీ రాజకీయ నాయకుడిని మాత్రం చేసుకోనని కామెంట్ చేశారు. ఈ వీడియో బయటకు తీసిన నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు. అప్పుడేమో పొలిటీషన్ ని పెళ్లి చేసుకోనని చెప్పింది, ఇప్పుడేమో అందుకు భిన్నంగా రాజకీయవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంటుందని ఎద్దేవా చేస్తున్నారు.
ఏదో మాట వరసకు ఇచ్చిన స్టేట్మెంట్ ఆమె మెడకు చుట్టుకుంది. కాగా 2011లో పరిణితి చోప్రా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. లేడీస్ వర్సెస్ రిక్కీ భాయ్ ఈమె మొదటి చిత్రం. ఇరవైకి పైగా చిత్రాల్లో పరిణితి చోప్రా నటించారు. అక్క ప్రియాంక చోప్రా స్థాయిలో సక్సెస్ కాలేదు.
“I don’t want to marry any politician. I don’t want to marry any politician ever,” said @ParineetiChopra in a fun #RapidFire with me a few years back https://t.co/FMThcsHIwU pic.twitter.com/eQfizKS4ja
— Faridoon Shahryar (@iFaridoon) April 2, 2023