
Heroine Kushboo Father: సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కుష్బూ..ఈమె ఆరోజుల్లో తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ఇప్పటికీ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే ఉంది.అయితే కుష్బూ కి ఆరోజుల్లో తమిళనాడు లో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు, ఆరోజుల్లో ఈమెని ఎంతలా అభిమానించేవారంటే అక్కడి జనాలు ఈమెని దేవతలాగా పూజించి గుడి కూడా కట్టేసారు.
అంతటి ఆరాధ్యం బహుశా మనం స్టార్ హీరోలకు కూడా చూసి ఉండము.కేవలం సినిమాల్లోనే కాదు ,ఈమె రాజకీయాల్లో కూడా గొప్పగా రాణించింది.ప్రస్తుతం బీజేపీ పార్టీ కొనసాగుతున్న కుష్బూ సుందర్ రీసెంట్ గా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్మన్ గా నియమించింది.ఈ సందర్భంగా ఆమె సమాజం లో ఆడవాళ్లపై అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయో తన జీవితం లో చోటు చేసుకున్న ఒక చేదు నిజాన్ని పంచుకుంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం గా మారాయి.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘నేను నా చిన్నతనం నుండే లైంగిక వేధింపులకు గురి అయ్యాను.అది ఎక్కడో కాదు, నా కన్న తండ్రి దగ్గరే.ప్రతీ రోజు తాగేసి ఇంటికి వచ్చేవాడు.మా అమ్మని కొట్టేవాడు, నన్ను లైంగిక వేధింపులకు గురి చేసేవాడు.నా 8 ఏళ్ళ వయస్సు నుండి ఆ కామాందుడు నుండి ఇవన్నీ నేను భరించాను.నాకు 15 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు అతని పై తిరిగి దాడి చెయ్యడం ప్రారంభించాను,నాకు 16 వ వయస్సు వచ్చే సమయానికి అతను మా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు’ అంటూ చెప్పుకొచ్చింది కుష్బూ.ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు చూసి అంత పెద్ద స్టార్ హీరోయిన్ కి ఇలాంటి నీచమైన పరిస్థితి ఏర్పడిందా..అయినా కన్న కూతురు పై అత్యాచారం చెయ్యడం ఏమిటి అని నివ్వెరపోయి సోషల్ మీడియా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.