https://oktelugu.com/

Heroine Iliana Hospitalised : అయ్యో… ఇలియానాకు ఏమైంది? ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్న డాక్టర్స్, ఆహారం తీసుకోలేని పరిస్థితి!

Heroine Iliana Hospitalised : హీరోయిన్ ఇలియానా అనారోగ్యం బారినపడ్డారు. సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది ఇలియానా. దేవదాసు మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈమె అనతికాలంలో ఫేమ్ తెచ్చుకున్నారు. దేవదాసు మూవీ హిట్ కావడంతో వెంటనే మహేష్ తో ఛాన్స్ వచ్చింది. దర్శకుడు పూరి జగన్నాధ్ పిలిచి మరీ భారీ ఆఫర్ ఇచ్చారు. పూరి నమ్మకాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 30, 2023 / 07:22 PM IST
    Follow us on

    Heroine Iliana Hospitalised : హీరోయిన్ ఇలియానా అనారోగ్యం బారినపడ్డారు. సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది ఇలియానా. దేవదాసు మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈమె అనతికాలంలో ఫేమ్ తెచ్చుకున్నారు. దేవదాసు మూవీ హిట్ కావడంతో వెంటనే మహేష్ తో ఛాన్స్ వచ్చింది. దర్శకుడు పూరి జగన్నాధ్ పిలిచి మరీ భారీ ఆఫర్ ఇచ్చారు. పూరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పోకిరి విజయంలో ఇలియానా కీ రోల్ ప్లే చేసింది. ఇలియానా గ్లామర్ యంగ్ కి పిచ్చెక్కించింది.

    ఆ మూవీతో అబ్బాయిల కలల రాణిగా మారిపోయింది. పోకిరి ఇండస్ట్రీ కాగా… ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాప్ స్టార్స్ తో జతకడుతూ హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్ ఇండియాలో ఆఫర్స్ వస్తున్న తరుణంలో ఆమె బాలీవుడ్ పై కన్నేసి కెరీర్ నాశనం చేసుకుంది. 2012లో రన్బీర్ హీరోగా విడుదలైన బర్ఫీ చిత్రంలో ఇలియానా నటించారు. ప్రియాంక చోప్రా మరో హీరోయిన్. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన బర్ఫీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    వరుసగా బాలీవుడ్ లో చిత్రాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. ఊరకే వచ్చిన స్టార్డం కావడంతో ఆమెకు దాని విలువ తెలియలేదు. బాలీవుడ్ లో కూడా తన జర్నీ కేక్ వాక్ అనుకుంది. అయితే ఆమెకు దెబ్బ మీద దెబ్బ పడ్డాయి. వరుస ప్లాప్స్ తో ఎక్కడికో పడిపోయింది. ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు. రెంటికి చెడ్డ రేవడి లాగా… ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. దానికి తోడు లవ్ ఎఫైర్, బ్రేకప్ వ్యక్తిగత సమస్యలకు కారణమైంది. ఒక దశలో డిప్రెషన్ లోకి వెళ్లిన ఇలియానా బరువు కూడా పెరిగారు.

    చికిత్స తీసుకొని బయటపడ్డారు. బరువు తగ్గి యథాస్థితికి చేరుకున్నారు. అయితే ఆమె కెరీర్ గాడిన పడలేదు. అడపదడపా చిత్రాలు, వెబ్ సిరీస్లు చేసుకుంటుంది. తమన్నా, కాజల్ మాదిరి లాంగ్ కెరీర్ అనుభవించాల్సిన ఇలియానా చేజేతులా పాడుచేసుకుంది. తాజాగా ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. మూడు బ్యాగ్స్ ఫ్లూయిడ్స్ ఎక్కించారట. డాక్టర్స్ పర్యవేక్షించారట. తన అనారోగ్యం గురించి ఇంస్టాగ్రామ్ లో ఇలియానా తెలియజేసింది. ఆమె పోస్ట్ ఫ్యాన్స్ ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అనంతరం కోలుకున్నట్లు ఇలియానా మరో పోస్ట్ పెట్టారు. అయితే ఆమెకు ఏమైంది? ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని? స్పష్టత ఇవ్వలేదు.