Faria Abdullah : ఫరియా అబ్దుల్లా.. ఈ పొడుగు కాళ్ల సుందరి జాతి రత్నాలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వరుస పెట్టి ఆమెకు అవకాశాలు వచ్చాయి. కానీ ఈ మల్టీ టాలెంటెడ్ గర్ల్ ఏది పడితే అది ఒప్పుకోవడం లేదు. బంగార్రాజు సినిమాలో టైటిల్ సాంగ్ లో నాగార్జునతో ఆడి పాడింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. తర్వాత ఇన్ని రోజులకు లైక్ షేర్ సబ్స్క్రైబ్, రావణా సుర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముస్లిం కుటుంబానికి చెందిన ఈమె సినిమాలోకి రావడమే ఒక ఇంట్రెస్ట్. తల్లి ముస్లిం, తండ్రి కన్వర్టెడ్ ముస్లిం. పుట్టింది హైదరాబాద్ అయినప్పటికీ తెలుగు అంతగా రాదు. జాతి రత్నాలు సినిమాకు ముందు ఫరియాకు అంతగా తెలుగు రాకపోయేది. ఎప్పుడైతే అనుదీప్ చేతిలో పడిందో ఒక్కసారిగా ఆమె తన తీరు మార్చుకుంది. నవీన్ పొలిశెట్టి కూడా నటనలో మెలకువలు నేర్పడంతో జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్ర ఈజీగా చేయగలిగింది. కేవలం నటన మాత్రమే కాకుండా ట్రావెలింగ్, పోయెట్రీ రైటింగ్, డాన్సింగ్, పెయింటింగ్ ఇన్ హాబీలు.

-దెబ్బకు కత్తి బయటకు తీసింది
మధ్యతరగతి కుటుంబాన్ని నుంచి వచ్చిన ఫరియా కు సింగిల్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. బహుశా ఆమె నిజ జీవితంలో పాత్రనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే సినిమాలో పెట్టారు కావచ్చు. ఒకసారి ఆమె సింగిల్ గా ట్రెక్కింగ్ వెళ్ళింది. దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూ చీకటిగా ఉంది. అదే సమయంలో ఆమెకు దాహం వేసింది. పక్కన చూస్తే ఎవరూ లేరు. అటుగా వస్తున్న ఓ వ్యక్తిని నీళ్లు అడిగింది. వెంటనే అతడు ఒక బాటిల్ తీసి ఇచ్చాడు. దాని మూత ఓపెన్ చేసి రెండు గుటకలు వేయగానే ఆమెకు ఏదో తేడా అనిపించింది. వెంటనే ఏంటి ఇది అని అడిగింది. దానికి అతడు వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు. తాను తాగింది మద్యం అని ఆమెకు అర్థమైంది. వెంటనే బ్యాగ్ లో ఉన్న కత్తి బయటకు తీసింది. జాకీచాన్ లా ఫోజు పెట్టింది. వెంటనే అతడు పారిపోయాడు. ఈ ఘటన తనకు నవ్వు తెప్పిస్తుందని ఫరియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
-మల్టీ టాలెంటెడ్ గర్ల్
కేవలం నటన మాత్రమే కాకుండా ఫరియా అద్భుతమైన డాన్సర్ కూడా. పాటలు పాడుతుంది. కవిత్వం రాస్తుంది. బొమ్మలు గీస్తుంది. ఒంటరిగా దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు అంటే సినిమా స్టార్ అయిపోయింది కానీ.. ఒకప్పుడు తాను కూడా ఆటోలు, ఎంఎంటీఎస్ రైళ్లల్లో ప్రయాణం చేసింది. ఎక్కడికైనా వెళ్లాలంటే తన బడ్జెట్ లోబడే ప్రణాళికలు రూపొందించుకునేది. ఇప్పుడు సినిమా స్టార్ అయిపోయాక లగ్జరీ లైఫ్ అనుభవిస్తోంది. తను హైదరాబాదులో చదువుకునేటప్పుడు ఖురాన్ చదివేది. ఆ పదాలకు అర్థం తెలియనప్పుడు వాళ్ళ నాన్నను అడిగి తెలుసుకునేది. ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన ఎటువంటి కట్టుబాట్లు నన్ను ఇబ్బంది పెట్టలేదని చెప్పే ఫరియా.. అరబిక్ క్లాసులకు ఒకటి రెండు సార్లు వెళ్లి ఏమీ అర్థం కాక తిరిగి వచ్చింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మాయిలకు సెక్యూరిటీ ఉందని చెప్పే ఫరియా.. తాను చలాకీగా ఉన్నానని చనువు తీసుకుంటే చెంప పగలగొడతానని తేల్చి చెప్పింది. ఇక చిన్నప్పటినుంచి ఫరియాకు లెక్కలు ఉంటే భయం. ఎలాగోలా పది పూర్తి చేసి.. ప్రైవేట్ గా ఓ కోర్స్ చదివింది. పేరుకు ముస్లిం కుటుంబం అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో అన్ని పండుగలు జరుపుకుంటామని ఫరియా వివరించింది. నెలకు రెండు లేదా మూడు పండుగలు వస్తుంటాయని.. ఈ సమయంలో మా అమ్మ చేసే పిండి వంటలు కడుపునిండా తింటానని ఫరియా చాలా ఇష్టంగా చెప్పింది. కాగా త్వరలో రవితేజ తో కలిసి నటించిన రావణాసుర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.