https://oktelugu.com/

Heroine Ester: మేనేజర్లతో అడిగించారు.. ఆ కోరిక తీర్చమన్నారు: ఎస్తర్ షాకింగ్ కామెంట్స్

Heroine Ester: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అగ్రహీరోయిన్ల నుంచి సామాన్య నటీమణుల వరకూ లైంగిక వేధింపులకు గురైన వారే. ఎంతో మంది తమకు జరిగిన అవమానాలను బయటపెట్టి సంచలనం సృష్టించారు. నటిగా, సింగర్ నోయల్ మాజీ భార్యగా పలు సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన నటి ఎస్తర్ తాజాగా సంచలన విషయాన్ని చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందని తెలుసు కానీ.. ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదని ఆమె సంచలన […]

Written By:
  • NARESH
  • , Updated On : June 2, 2022 / 10:20 PM IST
    Follow us on

    Heroine Ester: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అగ్రహీరోయిన్ల నుంచి సామాన్య నటీమణుల వరకూ లైంగిక వేధింపులకు గురైన వారే. ఎంతో మంది తమకు జరిగిన అవమానాలను బయటపెట్టి సంచలనం సృష్టించారు.

    నటిగా, సింగర్ నోయల్ మాజీ భార్యగా పలు సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన నటి ఎస్తర్ తాజాగా సంచలన విషయాన్ని చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందని తెలుసు కానీ.. ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

    తనకు కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె తెలిపింది. తన దగ్గరకు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నేరుగా వచ్చి అడగలేదని.. ఇన్ డైరెక్టుగా మేనేజర్లను పంపించి మీరు కాస్టింగ్ కౌచ్ గురించి అడిగి ఇబ్బందులు పెట్టారని ఎస్తర్ తెలిపారు.  ‘తెలుగులో కేవలం మూడు సినిమాలే చేశాను. కన్నడంలో కొన్ని మూవీస్ చేశాను’. అయితే, నన్ను కమిట్ మెంట్ అడగడం నాకు నచ్చలేదు అంటూ ఎస్తర్ మొత్తానికి ఓపెన్ గా చెప్పింది. ఏది ఏమైనా తెలుగు వెండితెర పై బోల్డ్ గా ఉండని అమ్మాయిలకు ఆదరణ ఉండదు అని చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట.

    ఎస్తర్ తనకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడానికి కారణాలు తెలిపింది. ‘ఇండస్ట్రీలో ఆఫర్స్ కావాలంటే ఒకరు ఇద్దరు హీరోలు కమిట్‌మెంట్ అడిగారు. ఒప్పుకోకపోతే కేరీర్ ముగిసిపోతుంది, ఇక్కడే ఆగిపోతావు, ముందుకెళ్లలేవని బెదిరించారు. సినిమా అంటే నాకిష్టం కానీ అదే జీవితం కాదు. దానికోసం దిగజారడం అవసరం లేదు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తున్నాయి’ అని తెలిపింది.

    అవకాశాల కోసం వారి కోరికలు తీరిస్తే మనం ఎంతో మందిని మోసం చేసినట్లేనని ఈ సందర్భంగా ఎస్తర్ తెలియజేశారు. చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులు అలాగే మనకు సినిమా ట్రైనింగ్ ఇచ్చిన గురువులను కూడా మనం మోసం చేసినట్లేనని ఈ సందర్బంగా ఆమె తెలిపారు. మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతటే అవే వస్తాయని కమిట్ మెంట్ ఇవ్వకూడదని ఎస్తర్ వివరించారు.

    భీమవరం బుల్లోడు లాంటి హిట్ మూవీలో హీరోయిన్‌గా నటించిన ఎస్తర్ నోరోన్హకు ఎందుకు అవకాశాలు రావు. ఆమె మంచి నటి కూడా. అయినా ఆమె హీరోయిన్ గా రాణించలేకపోవడం బాధాకరమైన విషయం.