
Heroine Anjali marriage: హీరోయిన్ అంజలి పెళ్లి పీటలు ఎక్కనున్నారట. ఈ మేరకు పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ విశ్వసనీయ సమాచారం అంటున్నారు. అచ్చ తెలుగు గోదావరి అమ్మాయి అయిన అంజలి పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాజోలులో. అంజలి ప్రస్తుత వయసు 36. పెళ్లి చేసుకోవడానికి ఇదే రైట్ ఏజ్. ఇంకా లేటు చేస్తే ఏజ్ బార్ పెళ్లి కూతురు అవుతుంది. దీంతో పేరెంట్స్ పెళ్లి చేయాలని డిసైడయ్యారట. త్వరలో ఈ మేరకు ప్రకటన రానుందని అంటున్నారు.
అంజలి పేరెంట్స్ అమెరికాలో ఉంటారట. ఇటీవల ఇండియా వచ్చి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఇక చెన్నైలో స్థిరపడిన తెలుగు అబ్బాయిని అంజలికి భర్తగా ఎంపిక చేశారట. ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్ సీ 15 లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ముగిసిన అనంతరం పెళ్లి చేసుకుంటారట. ఈ ఏడాది చివరికల్లా అంజలి అత్తారింట్లో అడుగు పెట్టడం ఖాయం అంటున్నారు.
కాగా కోలీవుడ్ యంగ్ హీరో జై ని అంజలి ప్రేమించారు. జర్నీ మూవీలో జై, అంజలి కలిసి నటించారు. చాలా కాలం ఎఫైర్ నడిచింది. కొన్నాళ్ల క్రితం మనస్పర్థలతో విడిపోయారు. ఈ బంధం గురించి అంజలి ఒకటి రెండు సందర్భాల్లో ఓపెన్ అయ్యారు. జై తో బ్రేకప్ అయ్యాక ఆమె సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. ఇక అంజలి కెరీర్ పరిశీలిస్తే 2006లో ‘ఫోటో’ అనే తెలుగు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. అనంతరం మరో చిన్న చిత్రం చేసింది.
కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిన అంజలి అక్కడ సక్సెస్ అయ్యారు. తమిళంలో అంజలి నటించిన షాపింగ్ మాల్, జర్నీ సూపర్ హిట్ కొట్టాయి. చాలా గ్యాప్ అనంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజకు జంటగా బలుపు మూవీ చేసింది. ఇవి రెండు మంచి విజయాలు సాధించాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీ గీతాంజలి సైతం హిట్ స్టేటస్ అందుకుంది. ఈ మధ్య వరుసగా డిజిటల్ సిరీస్లు చేస్తున్నారు. జాన్సీ, జాన్సీ 2, ఫాల్ వెబ్ సీరీస్ లలో అంజలి నటించారు. బహిష్కరణ టైటిల్ తో మరో సిరీస్ తెరకెక్కుతుంది. ఆర్ సీ 15లో రామ్ చరణ్ భార్యగా కనిపించనున్నారు.