
Hero Surya: సౌత్ ఇండియా లో సూర్య ఒక గొప్ప స్టార్ హీరో మాత్రమే కాదు,వ్యక్తిగతంగా కూడా ఒక మంచి మనిషిగా ఆయనకీ ఎంతో మంచి పేరుంది.ఇన్నేళ్లు ఇండస్ట్రీ లో ఉన్నా కూడా ఎలాంటి కాంట్రవర్సీ లేని ఏకైక సెలబ్రిటీ ఆయన మాత్రమే.2006 వ సంవత్సరం లో తాను ఎంతగానో ప్రేమించిన ప్రముఖ హీరోయిన్ జ్యోతిక ని పెళ్ళాడి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి ఎంతో ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్న సూర్య గురించి లేటెస్ట్ గా కోలీవుడ్ లో ప్రచారం అవుతున్న ఒక వార్త సంచలనం గా మారింది.
అసలు విషయానికి వస్తే సూర్య ది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం.తన భార్య పిల్లలతో పాటు, తన తమ్ముడు కార్తీ భార్యాపిల్లలు మరియు తన తల్లితండ్రులతో కలిసి 20 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు.అలా అందరూ కలిసి ఉండడానికి కారణం మా వదిన జ్యోతికనే అని కార్తీ అనేక సందర్భాలలో తెలిపాడు కూడా.
అయితే ఇప్పుడు ఈ ఉమ్మడి కుటుంబం విడిపోయింది.సూర్య తన భార్య జ్యోతిక మరియు తన పిల్లలతో కలిసి సెపెరేట్ కాపురం పెట్టాడట.ముంబై లో రీసెంట్ గా కొనుకున్న ఒక ఇంట్లో వీళ్ళు ప్రస్తుతం ఉంటున్నట్టు తెలుస్తుంది.అక్కడి నుండే సూర్య చెన్నై కి వచ్చి షూటింగ్స్ చేస్తున్నాడట.ఇన్నేళ్లు ఉమ్మడి కుటుంబం గా ఉంటూ అకస్మాత్తుగా ఇలా విడిపోవడానికి కారణం తన తండ్రి శివ కుమార్ తో సూర్య కి ఏర్పడిన విభేదాలు అని తెలుస్తుంది.

జ్యోతిక సినిమాల్లో తిరిగి నటిస్తున్నప్పటి నుండి శివ కుమార్ తో తరుచు విభేదాలు ఏర్పడుతూనే ఉండేవని, ఇప్పుడు పరిస్థితి చెయ్యి దాటిపోవడం తో ఇక గొడవలు పడే ఓపిక లేక సూర్య కుటుంబానికి దూరంగా ఉండేందుకే నిర్ణయించుకున్నాడని కోలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది.మరి ఈ రూమర్స్ పై హీరో సూర్య కానీ, లేదా జ్యోతిక కానీ స్పందిస్తారో లేదో చూడాలి.
