https://oktelugu.com/

Naga Shaurya viral video : రోడ్డు మీద లవర్స్ తో గొడవపడిన హీరో నాగ శౌర్య..వైరల్ గా మారిన వీడియో

Naga Shaurya viral video : యంగ్ హీరోలలో విభిన్నమైన అంశాలను టచ్ చేస్తూ సినిమాలు తీసే హీరో నాగ శౌర్య.తన తొలి సినిమా నుండి ప్రతీ చిత్రం డిఫరెంట్ గా ఉండేటట్టే చూసుకున్నాడు. అందుకే హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా నాగశౌర్య కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈ యువహీరో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘నారి నారి నడుమ మురారి’ మరియు ‘పోలీస్ వారి హెచ్చరిక’ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 28, 2023 / 01:08 PM IST
    Follow us on

    Naga Shaurya viral video : యంగ్ హీరోలలో విభిన్నమైన అంశాలను టచ్ చేస్తూ సినిమాలు తీసే హీరో నాగ శౌర్య.తన తొలి సినిమా నుండి ప్రతీ చిత్రం డిఫరెంట్ గా ఉండేటట్టే చూసుకున్నాడు. అందుకే హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా నాగశౌర్య కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈ యువహీరో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘నారి నారి నడుమ మురారి’ మరియు ‘పోలీస్ వారి హెచ్చరిక’ వంటి సినిమాలను చేస్తున్నాడు.

    గత ఏడాది ఆయన చేసిన ‘కృష్ణ వృందా విహారి’ విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది, కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి రెవెన్యూ ని రాబట్టింది. ఈ సినిమా తర్వాతనే నాగ శౌర్య పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే నాగ శౌర్య ఈరోజు ఉదయం హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక ప్రేమ జంట పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా నిలిచింది.

    ఇక అసలు విషయానికి వస్తే.. రోడ్డు మీద ఇద్దరు లవర్స్ గొడవపడుతున్నారు. అబ్బాయి అమ్మాయిని లాగిపెట్టి చెంపమీద ఒకటి కొడుతాడు. ఇది అటు వైపుగా కారులో వెళ్తున్న నాగశౌర్య చూసి వెంటనే దిగి రోడ్డు వాళ్ళ వద్దకి వచ్చాడు. ‘ఆ అమ్మాయిని ఎందుకు కొడుతున్నావ్’ అని అడుగుతాడు. ‘నా లవర్ నా ఇష్టం, నీకెందుకు’ అని పొగరుగా ఆ అబ్బాయి సమాధానం ఇస్తాడు. అప్పుడు నాగశౌర్య ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకొని ‘మర్యాదగా ఆ అమ్మాయికి సారీ చెప్పు’ అని గొడవకి దిగుతాడు. అలా ఆ అబ్బాయితో నాగ శౌర్య గొడవ పడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది.

    ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.సాధారణంగా నాగ శౌర్య తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకునే విషయంలో కొన్ని కొత్త ఐడియాస్ తో మన ముందుకు వస్తుంటాడు.ఇది కూడా తన సినిమా కోసం పబ్లిసిటీ అయ్యి ఉంటుందేమో అని నెటిజెన్స్ అనుకుంటున్నారు.కానీ అది పబ్లిసిటీ కాదని, నిజమైన రియాక్షన్ అని తర్వాత తెలిసింది. ఓ అమ్మాయిని కొట్టిన అబ్బాయిని నిజాయితీగా నిలదీసిన నాగశౌర్య తీరుకు ప్రశంసలు కురుస్తున్నాయి.

    https://twitter.com/UnqBoi007/status/1630375426639134727?s=20