https://oktelugu.com/

Tollywood Celebrity: బ్రేకింగ్ : పెళ్లి అంటూ సడెన్ గా షాక్ ఇచ్చిన హీరో హీరోయిన్లు !

Tollywood Celebrity: హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం ప్రత్యేక పాత్రల్లో రాణిస్తున్నాడు ఆది పినిశెట్టి. తెలుగు తెర పై నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించాడు. పవర్ స్టార్, ఐకాన్ స్టార్ లాంటి బలమైన హీరోల ముందు కూడా తన నటనతో నిలబడిన టాలెంట్ ఆది పినిశెట్టిది. అలాంటి హీరో హఠాత్తుగా తనకు పెళ్లి అయిపోయింది అని తన భార్యతో కలిసి ఒక ఫోటో దిగి తన సన్నిహితులకు పంపాడు. ఆ హీరోగారు సడెన్ గా తన […]

Written By:
  • Shiva
  • , Updated On : March 26, 2022 / 05:57 PM IST
    Follow us on

    Tollywood Celebrity: హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం ప్రత్యేక పాత్రల్లో రాణిస్తున్నాడు ఆది పినిశెట్టి. తెలుగు తెర పై నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించాడు. పవర్ స్టార్, ఐకాన్ స్టార్ లాంటి బలమైన హీరోల ముందు కూడా తన నటనతో నిలబడిన టాలెంట్ ఆది పినిశెట్టిది. అలాంటి హీరో హఠాత్తుగా తనకు పెళ్లి అయిపోయింది అని తన భార్యతో కలిసి ఒక ఫోటో దిగి తన సన్నిహితులకు పంపాడు.

    ఆ హీరోగారు సడెన్ గా తన సతీమణిని పరిచయం చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె ఒక హీరోయిన్. అసలు హీరో – హీరోయిన్ పెళ్లి అంటే ఎలా ఉండాలి ? ముఖ్యంగా ఆర్భాటాలు, హడావుడి ఏ స్థాయిలో ఉండాలి ? ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే.. నిక్కీ గల్రాని. చిన్నాచితకా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే, ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిందిలే గానీ, ‘ఆది’ని మాత్రం బాగా ఆకట్టుకుంది.

    Also Read: CAG Report On AP: ఏపీ బడ్జెట్ లెక్కలు ‘కాగ్’ ఎందుకు బయటపెట్టలేదు?

    ఆది చాలా కాలంగా నిక్కీ గల్రానితో డేటింగ్ లో ఉన్నాడు. అయితే, వీరిద్దరూ డేటింగ్ కి ముగింపు పలికి ఒక్కటి అయ్యారు. ఈ నెల 24 వ తేదీన వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయిందని గతంలోనే మేము ఎక్స్ క్లూజివ్ గా రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

    మేము ముందు చెప్పిన విధంగానే ఈ జంట పెళ్లితో ఒక్కటి అయ్యింది. గతంలో ఆది – నిక్కీ కలిసి 2015లో ‘మలుపు’ అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ బంధం కొనసాగుతూ ఉంది. కానీ ఈ హీరో – హీరోయిన్ లిద్దరూ తమ పెళ్లి తంతును సింపుల్ గా ముగించడం ఫ్యాన్స్ ను షాక్ కి గురి చేసింది. ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖులు పెళ్లి లాంటి ముఖ్యమైన ఘట్టాలకు కూడా సింపుల్ గా శుభం కార్డు పలికేస్తున్నారు.

    సహజంగా నచ్చిన వారితో సహజీవనం, ఆ తర్వాత కూడా నచ్చితే వివాహం వరకు వెళ్తుంది వ్యవహారం. ఆ తర్వాత తీరిగ్గా వివాహం చేసుకుని.. మాకు పెళ్లి అయిపోయిందోచ్ అని ఒక చిన్న స్టేట్ మెంట్ పడేస్తున్నారు. అసలు ‘నిక్కీ గల్రాని’ ఎవరో కాదు, కన్నడ హీరోయిన్ సంజన గల్రానికి స్వయానా చెల్లెలు.

    Also Read: SS Rajamouli Special Story: ‘రాజమౌళి..’ మనిషా ? ఎమోషనల్ మిషనా ?

     

    Tags