ఈ భూమ్మీద నూకలు రాసిపెట్టి ఎంత ప్రమాదం జరిగినా బతకవచ్చని ఒక తాజా సంఘటన నిరూపించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో అద్భుతమే జరిగింది. చనిపోయిన వ్యక్తి నుంచి గుండెను తీసి ఓ హుద్రోగికి అమర్చడానికి ప్లాన్ చేశారు. గుండెను తీసుకొచ్చి హెలిక్యాప్టర్ కుప్పకూలింది. అయినా ఆ గుండెను తీసుకొని వైద్యులు వెళుతుండగా జారిపడగా గుండె కిందపడిపోయింది. అయినా ఆ గుండె బతకడం విశేషం.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
ఓ రోగిని కాపాడేందుకు దాత నుంచి సేకరించిన గుండెను హుటాహుటిన కేక్ ఆస్పత్రికి తరలించేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే హెలిక్యాప్టర్ హాస్పిటల్ మీద ఉన్న హెలిప్యాడ్ మీదకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది.ఈ ఘటనలో పైలట్ కు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా ఇద్దరు ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు.ప్రమాద సమయంలో గుండెను ఉంచిన బాక్స్ సురక్షితంగానే ఉంది.
Also Read: ప్రియుడితో పెళ్లి చేస్తారా? చావాలా.. యువతి హల్ చల్
ఇక గుండె బాక్స్ ను తీసుకొని వెళుతున్న వైద్యుడు ఒక్కసారిగా కిందపడ్డాడు. ఆ గుండె కూడా బాక్సు నుంచి జారి కిందపడింది. అయినా ఆ గుండెకు ఏమీ కాలేదు. కిందపడ్డ గుండెను శుభ్రం చేసిన వైద్యులు వ్యక్తికి అమర్చి ప్రాణం పోశారు. ఈ అద్భుతానికి నిదర్శనమైన లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.