Jr NTR:ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ పెద్దల భేటి ముగిసింది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం.. ఈ భేటికి చిరంజీవితోపాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా రావాల్సింది. కానీ సడెన్ గా ఆయన రాలేదు. ఎందుకు? ఏమిటీ అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. జగన్ ను కలవడానికి అగ్రహీరోలతోపాటు జూ.ఎన్టీఆర్ వస్తాడని ప్రకటించారు కూడా.. కానీ చివరి నిమిషంలో ఎన్టీఆర్ విరమించుకున్నారట.. దానికి కారణం ఆయనేనని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి నేతృత్వంలో జగన్ తో జరిగిన ఈ భేటికి మహేష్, ప్రభాస్, రాజమౌళితోపాటు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ రావాల్సి ఉంది. ఇక వీళ్లే కాక ఆర్. నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి లాంటి వైసీపీ సానుభూత సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
అయితే టాలీవుడ్ లోనే ప్రముఖ టాప్ కుటుంబాల్లో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరూ కూడా హాజరు కాలేదు. నిజానికి జగన్ తో భేటికి టీడీపీ ఎమ్మెల్యే కం హీరో అయిన బాలకృష్ణ వస్తాడని భావించారట.. ఈక్రమంలోనే బాబాయ్ వెళుతుండడంతో అబ్బాయి ఎన్టీఆర్ ఈ భేటికి రాలేదట.. కానీ బాలయ్య కూడా చివరి నిమిషంలో రాకపోవడంతో నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్క హీరో కూడా ఈ భేటిలో పాల్గొనలేదు.
ఇక నందమూరి ఫ్యామిలీ అంతా చంద్రబాబుకు సన్నిహితులు కావడం.. స్వయంగా బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే కావడంతో వారికి వ్యతిరేకంగా ఈ భేటికి వెళితే నందమూరి అభిమానుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని ఎన్టీఆర్ కూడా జగన్ తో భేటికి రాలేదని సమాచారం.