Homeలైఫ్ స్టైల్Watermelon: వావ్.. పుచ్చ కాయ వల్ల ఇన్ని లాభాలా ?

Watermelon: వావ్.. పుచ్చ కాయ వల్ల ఇన్ని లాభాలా ?

Watermelon: పుచ్చ కాయ అనగానే ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. మీకు తెలుసా ? పుచ్చకాయ పుట్టిల్లు ఆఫ్రికా. ఎండాకాలంలో పుష్కలంగా లభిస్తూ.. దాహాన్ని తీరుస్తుంది. మనల్ని వడదెబ్బ నుండి కాపాడుతుంది. పైగా పుచ్చకాయ ఒక విధమై తియ్యదనంతో మధురంగా ఉంటుంది. అసలు పుచ్చకాయ నిండా నీరే ఉంటుంది. పైగా పుచ్చకాయకు, దోసకాయకు దగ్గర పోలికలు ఉంటాయి. అంటే, ఈ రెండు కాయలు ఒకే కుటుంబానికి చెందినవి అన్నమాట. మరి 100 గ్రా.ల పుచ్చకాయలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో తెలుసా ? ఈ క్రింది విధంగా ఉంటాయి, తెలుసుకోండి.

Watermelon
Watermelon

100 గ్రా.ల పుచ్చకాయలో పోషక విలువలు లిస్ట్ !

పీచు పదార్థం-0 మి. గ్రా
శక్తి : 17 కేలరీలు
ఉప్పు (సోడియం)-1మి గ్రాములు
పొటాషియం. -115 మి. గ్రా
పిండి పదార్థాలు-3.8గ్రాములు
క్రొవ్వు పదార్థాలు-0.2గ్రాములు
మాంసకృత్తులు -0.1గ్రాములు
సున్నం (కాల్షియం)-10గ్రాములు
భాస్వరం. -10గ్రాములు
మెగ్నీషియం-13గ్రాములు
ఇనుము. -0.2మి.గ్రాములు

Also Read: వరుస ఓటములు.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో నెగ్గడం కష్టమే.. నెటిజన్స్ ట్రోల్స్!

ఇక పుచ్చకాయలో అంతా నీరే కనుక, శక్తిని ఇచ్చే కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే, పుచ్చకాయ సులభంగా జీర్ణం అవుతుంది. అన్నిటికి మించి పుచ్చకాయలో ‘ఎ’, సి, విటమిన్ల పొటాషియం తదితర లవణాలు, బయోఫ్లేవనాయిడ్లు, కార్టోటెనాయిడ్లు ఉంటాయి. పుచ్చకాయ ప్రధానంగా శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రనలో పెట్టి ప్రశాంతతను కలిగిస్తోంది.

Watermelon
Watermelon

అలాగే, మూత్రకోశ వ్యాధులను కూడా పుచ్చకాయ నివారిస్తుంది. ఇక ఉబ్బసము – క్షయ, కోరింతదగ్గు తదితర కఫ సంబంధ వ్యాధి గ్రస్తులకు కూడా పుచ్చకాయ చాలా మేలు కలుగజేస్తుంది. అలాగే పుచ్చకాయలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. అందువలన రక్త హీనతను అది నివారిస్తుంది. అందుకే, పుచ్చకాయను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి.

Also Read: ఇవన్నీ కేవలం పుకార్లే.. క్లారిటీ ఇచ్చిన ‘సర్కారు..’ టీమ్ !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular