Uttarpradesh : ఇటీవల సమాజంలో పెడ ధోరణులు పెరుగుతున్నాయి. మహిళలపై అకృత్యాలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా యువత ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. బరి తెగించి వ్యవహరిస్తున్నారు. మరీ టార్చర్ పెడుతున్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న, ప్రశ్నిస్తున్న కుటుంబసభ్యులను కడతేర్చేందుకు సైతం వెనుకాడడం లేదు. నిర్భయ, దిశ వంటి చట్టాలు సైతం వారిని కట్టడి చేయడం లేదు. ఉత్తరప్రదేశ్ లో ఓ యువకుడు నడిరోడ్డుపై చేసిన అల్లరి చూస్తే సగటు బాలికల తల్లిదండ్రులకు కడుపు తరుక్కుపోతోంది. ఓ యువతిని యువకుడు అటకాయిస్తూ చేసిన అసభ్యకర ప్రవర్తన చూసి సభ్య సమాజం తలదించుకుంటోంది.
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఆర్యసమాజ్ ప్రాంతం అది. అక్కడి ఇరుకు రోడ్డులో ఓ యువతి ఒంటరిగా నడిచి వెళుతోంది. బైక్ పై వెళుతూ ఓ యువకుడు ఆమెను అనుసరిస్తున్నాడు. సెడన్ గా బైక్ పై ఆమె ముందు పెట్టి నడిరోడ్డుపై చెయ్యిలాగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి నుంచి విడిపించుకొని యువతి ముందుకు సాగింది. అక్కడికి కొద్దిదూరం వెళ్లిన యువతి వద్దకు మరోసారి వెళ్లి యువకుడు ఆమెను బలంగా తన వైపు లాక్కున్నాడు. తాకరాని చోట్ల చేయి వేస్తూ అసౌకర్యానికి గురిచేశాడు. అయితే అక్కడున్న వారు ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో బంధించారు. సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతున్నాయి. చివరకు అవి పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్టు సమాచారం.
అయితే యువకుడ్ని ప్రతిఘటించే క్రమంలో యువతి కేకలు, అరుపులు వేయకపోవడం విశేషం. ప్రేమ పేరుతో వేధింపులా? లేకుంటే ఇరుకు రోడ్డు కావడంతో ఆమె కేకలు ఎవరికీ వినిపించలేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. బాధిత బాలికను ఆరా తీయడంతో పాటు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
#मुज़फ़्फरनगर: सुनसान गली में अकेली लडक़ी से बदतमीजी, जबरदस्ती बाइक पर बैठाने की कोशिश, विरोध पर युवती के साथ मारपीट, मुंह पकड़कर भींचा, बैग भी पकड़कर खींचा, युवती के साथ जोर-जबरदस्ती का वीडियो हुआ वायरल, जानसठ के आर्य समाज मंदिर के पास का बताया जा रहा है वीडियो। #muzaffarnagar… pic.twitter.com/GEOr8xhSel
— Samachar Today (@samachartodaytv) June 23, 2023