
Nandamuri Kalyan Ram: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. హీరోగా ఆయన మొదటి చిత్రం తొలి చూపులోనే 2003లో విడుదలైంది. ఇప్పటి వరకు 20కి పైగా చిత్రాలు చేశారు. హీరోగా ఒక స్థాయికి వెళ్ళలేదు. నిజం చెప్పాలంటే టైర్ టు హీరోల జాబితాలో కూడా కళ్యాణ్ రామ్ కి చోటు దక్కలేదు. నందమూరి వారసుడిగా బలమైన అభిమాన వర్గం ఉండి కూడా ఎదగలేకపోయారు. కారణం సక్సెస్ రేటు లేకపోవడమే. నువ్వు ఎవరనేది అనవసరం… పరిశ్రమలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది.
Also Read: Amigos Collections: ‘అమిగోస్’ కి 50 శాతం కి పైగా నష్టాలు..నందమూరి హీరోల విజయయాత్ర కి బ్రేక్
సూపర్ హిట్స్ ఇచ్చే హీరోలనే పరిశ్రమ, ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. అభిమానించి ఆరాధిస్తారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో నిఖార్సైన హిట్స్ అంటే మూడే మూడు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అతనొక్కడే మూవీతో ఫస్ట్ హిట్ కొట్టాడు. తర్వాత మరో హిట్ చూడటానికి పదేళ్ల సమయం పట్టింది. కళ్యాణ్ రామ్ కి పటాస్ రూపంలో అనిల్ రావిపూడి ఒక హిట్ ఇచ్చారు. మరో ఏడేళ్ల తర్వాత బింబిసార చిత్రంతో హిట్ కొట్టాడు. కొత్త దర్శకుడు వశిష్ట్ బింబిసార చిత్రాన్ని తెరకెక్కించాడు.
కళ్యాణ్ రామ్ ని ఓ బ్యాడ్ సెంటిమెంట్ బింబిసార తర్వాత కూడా వదలకుండా వెంటాడింది. ఒక హిట్ పడితే వరుసగా పరాజయాలు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అన్న మాటే లేకుండా పోయింది. అందులోనూ హిట్ హిట్ కి మధ్య ఏళ్ల తరబడి గ్యాప్. ఈ పరిణామాలు ఆయన్ని స్టార్ కాకుండా చేశాయి. అమిగోస్ సక్సెస్ అయితే కళ్యాణ్ రామ్ కెరీర్ కి ప్లస్ అయ్యేది. కనీసం టైర్ టు హీరోల జాబితాలో చేరేవాడు.

అమిగోస్ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యాయి. కళ్యాణ్ రామ్ మూవీకి ప్లాప్ టాక్ వస్తే పరిస్థితి ఇంత దారుణమా అన్న అభిప్రాయానికి వచ్చారు. కళ్యాణ్ రామ్ మార్కెట్ ని అమిగోస్ భారీగా దెబ్బ తీసింది. ఈ ప్రభావం ఆయన నెక్స్ట్ మూవీపై కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇది స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. అమిగోస్ ఓ మోస్తరు విజయంతో బయటపడినా డెవిల్ చిత్రానికి హెల్ప్ అయ్యేది. అమిగోస్ రిజల్ట్ తో కళ్యాణ్ రామ్ కెరీర్ మళ్ళీ మొదటికి వచ్చింది.
Also Read: Dimple Hayathi: న్యూడ్ మసాజ్ ఫోటో లీక్ చేసిన రవితేజ హీరోయిన్..!