
Ram Charan- NTR: #RRR సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేము కానీ, ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్స్ మరియు పాన్ వరల్డ్ రేంజ్ ఫేమ్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టినట్టు అర్థం అయిపోతుంది.ఫిబ్రవరి నెలాఖరు నుండి రామ్ చరణ్ అమెరికా లోనే ఉంటున్నాడు.తన సొంతంగా ఎన్నో అంతర్జాతీయ మీడియా చానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు.
అంతే కాదు HCA అవార్డ్స్ లో ప్రెజెంటర్ అయ్యే అరుదైన అవకాశం ని దక్కించుకొని చరిత్ర తిరగరాసాడు, అంతే కాదు స్పాట్ లైట్ అవార్డు ని రాజమౌళి తో పాటుగా సొంతం చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచాడు.ఇక జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు తారకరత్న చనిపోవడం తో ఈ ఈవెంట్ కి హాజరు కాలేకపోయాడు.దీనితో #RRR మూవీ కి ఫేస్ గా రాజమౌళి తో పాటుగా రామ్ చరణ్ ని కూడా అంతర్జాతీయ మీడియా బాగా ప్రమోట్ చేసింది.
ఇది ఎన్టీఆర్ ఈగో ని బాగా హర్ట్ చేసిందని ఫిలిం నగర్ లో ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్.ఎందుకంటే ఇలాంటి రూమర్స్ రావడం అనేది సర్వసాధారణం.అయితే మార్చి 5 వ తారీఖున ఎన్టీఆర్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు.రెండు మూడు రోజులు ఖాళీగానే హోటల్ రూమ్ లో ఉన్నాడు కాం, వచ్చిన దగ్గర నుండి రామ్ చరణ్ ని కలవలేదు.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం, గతం లో ఎన్నో ఫారిన్ ట్రిప్స్ కి టీం మొత్తం కలిసి వెళ్ళేవాళ్ళు, కలిసి ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.

కలిసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేసి, ఎవరికీ వారు సొంతం గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు.ఇదంతా గమనించిన తర్వాత వీళ్లిద్దరి మధ్య గ్యాప్ రాలేదు అంటే ఎవరు మాత్రం నమ్ముతారు..? కనీసం ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ జరిగే రోజైన వీళ్ళు కలిసి ఉంటారా..లేదా ఏడ మొహం పెడా మొహం లాగ ఉంటారా అనేది చూడాలి.
