Hansika- Sohail: హీరోయిన్ హన్సిక తన బ్యాచ్ లర్ జీవితానికి ముగింపు పలుకుతూ పెళ్లి పీటలెక్కబోతున్నారు. బ్యాచ్ లర్ పార్టీ చేసుకోవడానికి గ్రీస్ వెళ్లి తిరిగి వచ్చిన హన్సిక మోత్వాని డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో కాబోయే భర్త సోహైల్ కతురియాను వివాహం చేసుకోనున్నారు.

తాజాగా హన్సిక పెళ్లికి ముందు మెహందీ, సంగీత్ , సుఫీ నైట్ కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కనిపించాయి. ట్రెండ్ అవుతున్నాయి. ఈ వేడుక కోసం హన్సిక స్పెషల్ గా తయారు చేయించిన పసుపు రంగు, ఎరుపు రంగు దుస్తులను ధరించింది. ఆమె కాబోయే భర్త సోహైల్ పీచ్ , క్రీమ్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ ఫొటోలు, వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ వీడియోలను పోస్ట్ చేసిన హన్సిక మోత్వాని “ఎప్పటికైనా బెస్ట్ బ్యాచిలొరెట్. బెస్ట్‌తో బ్లెస్డ్ ది బెస్ట్.” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ముంబైకి చెందిన సోహైల్ కతురియా అనే వ్యాపారవేత్త గత నెలలో పారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు హన్సిక మోత్వానీకి ప్రపోజ్ చేశాడు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఈ చిత్రాలను పంచుకుంది. అప్పుడే వీరి ప్రేమ విషయం బయటకు తెలిసి త్వరగానే పెళ్లిపీటలెక్కింది.

ఇక సినిమాల పరంగా చూస్తే హన్సిక మోత్వాని హిందీ, తమిళం, తెలుగు, మలయాళం , కన్నడ చిత్రాలలో నటించింది. ఆమె 2001 టెలివిజన్ షో దేస్ మే నిక్లా హోగా చంద్‌తో నటిగా అరంగేట్రం చేసింది. అదే సంవత్సరంలో ప్రసారమైన పాపులర్ కిడ్స్ ఫాంటసీ షో ‘షక లక బూమ్ బూమ్’లో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది.
హృతిక్ రోషన్ ‘కోయి… మిల్ గయా’ హిమేష్ రేష్మియా యొక్క ‘ఆప్ కా సురూర్’ చిత్రాలతో హన్సిక మోత్వాని పేరు తెచ్చుకుంది. ఇక దేశముదురు, కందిరీగ, మస్కా, కంత్రి, అరణ్మనై, విలన్, సింగం 2 (సూర్య వెర్షన్), దేనికైనా రెడీ మరియు ఉయిరే ఉయిరే వంటి చిత్రాలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
View this post on Instagram
View this post on Instagram