
Trivikram Srinivas: తమకి అనుకూలంగా లేని వారిపై విషం కక్కడం పచ్చ మీడియా స్వభావం.ముఖ్యంగా మెగా ఫ్యామిలీ కి సంబంధించి ఏ చిన్న విషయాన్ని అయినా భూతద్దం లో చూసి దానిని వక్రీకరించి నెగటివ్ ప్రచారం చెయ్యడం వాళ్ళ స్టైల్.రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో ఎంతో సన్నిహితంగా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కూడా విషం చిమ్మడం ప్రారంభించింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకడు అనే సంగతి అందరికీ తెలిసిందే,స్టార్ హీరో తో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ వస్తుంటాయి.
అలాంటి డైరెక్టర్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడనే అక్కసుతో త్రివిక్రమ్ పై కూడా బురద చల్లడం ప్రారంభించింది.పవన్ కళ్యాణ్ సినిమాల డేట్స్ మరియి కాంబినేషన్ సెట్టింగ్స్ అన్నీ కూడా త్రివిక్రమే చేస్తున్నాడని,ఆయన అనుమతి లేనిదే ఏ టాప్ డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు వీలు లేదని , ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఆయన చేతిలో ఉండేలా సెట్ చేసుకున్నాడంటూ ఇలా పలు రకాల వార్తలను ప్రచారం చేసింది పచ్చ మీడియా.
పవన్ కళ్యాణ్ తో సినిమాలను సెట్ చేసినందుకు గాను త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతల దగ్గర నుండి బాగా డబ్బులు కూడా తీసుకుంటున్నాడు అంటూ ఇలా నోటికి వచ్చినట్టు ఏది పడితే అది రాసేశారు.నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఉన్న రేంజ్ కి ఇండియా లో ఏ సూపర్ స్టార్ ని అడిగినా వెంటనే కావాల్సినంత డేట్స్ ఇచ్చేస్తారు..నిర్మాతలు అయితే బ్లాంక్ చెక్ కూడా ఇచ్చేసి ఎంత కావాలంటే అంత రాసుకో అని చెప్పేంత రేంజ్ త్రివిక్రమ్ సొంతం.

అలాంటి త్రివిక్రమ్ కి ఇలా అడ్డదారిలో డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏమి ఉంటుంది.ఇటీవలే పవన్ కళ్యాణ్ పాల్గొన్న ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ లో త్రివిక్రమ్ ని నేను నా గురువులాగ చూస్తాను అని చెప్పడం ని చూస్తే వీళ్లిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందొ అర్థం అవుతుంది.ఈరోజు పవన్ కళ్యాణ్ కి ఇంత మంచి లైనప్ ఉండడానికి కారణం కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్..అది కేవలం స్నేహం కి విలువ ఇచ్చి చేసిందే కానీ మరొకటి ఆశించి కాదంటూ త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.