Walthair Veeraya and Veerasimha Reddy : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ లో బెన్ఫిట్ షోస్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..ఫ్యాన్స్ కి ఇక పండగే

Walthair Veeraya and Veerasimha Reddy : మన ఆంధ్ర ప్రదేశ్ లో గత మూడేళ్ళ నుండి ఒక సినిమాని స్వేచ్ఛగా ప్రదర్శించుకోవడానికి కూడా కుదరడం లేదు..కారణం ఇక్కడి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చట్టాలు అలా ఉన్నాయి మరి..అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినిమా ఇండస్ట్రీ కి చాలా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇండస్ట్రీ కి అండగా నిలుస్తుంది..టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు లేటెస్ట్ గా బెన్ఫిట్ షోస్ కి కూడా […]

Written By: NARESH, Updated On : January 10, 2023 8:29 pm
Follow us on

Walthair Veeraya and Veerasimha Reddy : మన ఆంధ్ర ప్రదేశ్ లో గత మూడేళ్ళ నుండి ఒక సినిమాని స్వేచ్ఛగా ప్రదర్శించుకోవడానికి కూడా కుదరడం లేదు..కారణం ఇక్కడి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చట్టాలు అలా ఉన్నాయి మరి..అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినిమా ఇండస్ట్రీ కి చాలా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇండస్ట్రీ కి అండగా నిలుస్తుంది..టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు లేటెస్ట్ గా బెన్ఫిట్ షోస్ కి కూడా అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలకు నాలుగు గంటల నుండి షోస్ ప్రదర్శించుకోవచ్చు అని ఒక అధికారిక జీవో ని జారీ చేసింది ప్రభుత్వం..గత కొద్దీ సంవత్సరాల నుండి హైదరాబాద్ సిటీ లో బెన్ఫిట్ షోస్ కి అనుమతిని నిరాకరిస్తూ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం..కారణం అసంఖ్యాకంగా వచ్చే జనాలను కంట్రోల్ చెయ్యడం కష్టం కాబట్టి.

కానీ తమిళనాడు లో అర్థరాత్రి నుండి షోస్ వేసుకోవడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుంది..రేపు విడుదల కాబోతున్న ‘వారిసు’ , ‘తూనీవు’ సినిమాలకు కూడా ఇదే పరిస్థితి..దీనితో తెలంగాణ ప్రభుత్వం పై అభిమానుల నుండి వత్తింది ఏర్పడింది..పక్క రాష్ట్రం లో ప్రభుత్వం ఇంత సహకరిస్తుంటే మీరెందుకు ఇన్ని లిమిటేషన్స్ పెడుతున్నారు అంటూ రోజూ సోషల్ మీడియా లో ప్రభుత్వాధికారులను ట్యాగ్ చేస్తూ పోస్టులు వేస్తున్నారు..అందుకే నెటిజెన్స్ మరియు నిర్మాతల రిక్వెస్ట్ లను పరిశీలించి ప్రభుత్వం బెన్ఫిట్ షోస్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.

ఇక వాల్తేరు వీరయ్య మరియు వీర సింహ రెడ్డి నైజాం ఏరియా ఓపెనింగ్స్ ఒక రేంజ్ లో వస్తుందనే చెప్పాలి..అభిమానులు ఈ రెండు సినిమాల కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ ప్రారంభం అవ్వగా , అన్ని ప్రాంతాలలో టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి..చూడాలి మరి ఈ రెండు సినిమాలలో ఏ చిత్రం పెద్ద హిట్ గా నిలుస్తుందో అనేది.