Pakka Commercial : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే?

Pakka Commercial : భారీ సక్సెస్ చకోర పక్షిలా తిరుగుతున్న హీరో గోపీచంద్.. మొదట హీరోగా.. అనంతరం విలన్ గా.. మళ్లీ హీరోగా రూపాంతరం చెందిన గోపీచంద్ పరిచయమై చాలా కాలమే అయినా కూడా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేక సతమతమవుతున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి కొన్ని విజయాలు అందుకున్నా బ్రేక్ ఇచ్చే స్థాయిలో అవి లేకపోవడం మైనస్. అయినప్పటికీ ప్రయత్నాలు ఆపకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో గోపీచంద్ కు ఏదీ కలిసి […]

Written By: NARESH, Updated On : July 1, 2022 12:46 pm
Follow us on

Pakka Commercial : భారీ సక్సెస్ చకోర పక్షిలా తిరుగుతున్న హీరో గోపీచంద్.. మొదట హీరోగా.. అనంతరం విలన్ గా.. మళ్లీ హీరోగా రూపాంతరం చెందిన గోపీచంద్ పరిచయమై చాలా కాలమే అయినా కూడా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేక సతమతమవుతున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి కొన్ని విజయాలు అందుకున్నా బ్రేక్ ఇచ్చే స్థాయిలో అవి లేకపోవడం మైనస్. అయినప్పటికీ ప్రయత్నాలు ఆపకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో గోపీచంద్ కు ఏదీ కలిసి రావడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో స్పీడుగా సినిమాలు తీస్తూ హిట్ కొట్టే దర్శకుడు ‘మారుతి’తో జతకలిశాడు. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘పక్కా కమర్షియల్’ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. జాక్స్ బెజాయ్ సంగీతాన్ని అందించాడు. యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీవాసు నిర్మించారు. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్ర పోషించారు.

ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందన్నది ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకుల స్పందన ఏంటన్నది తెలుసుకుందాం.

పక్కా కమర్షియల్ ఒక లాయర్ గురించి చెప్పే కథ అని చెబుతున్నారు. మారుతి దీనికి తనస్టైల్ కామెడీ, యాక్షన్ మిక్స్ చేసి తెరకెక్కించాడు. సినిమా ట్రైలర్ సహా అన్నింటికి స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి. ఫలితంగా సినిమా కోసం అందరూ వేచిచూశారు.

పక్కా కమర్షియల్ తెలుగు రాష్ట్రాల్లో 13.50 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే రెస్టాఫ్ ఇండియాలో రూ.50 లక్షలు, ఓవర్సీస్ లో 1.20 కోట్లతో కలిపి మొత్తం రూ.15.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది.

‘పక్కా కమర్షియల్’ మూవీకి అంతటా మిక్స్ డ్ టాక్ వచ్చింది. బాగుందని కొందరు.. ఫర్వాలేదని మరికొందరు చెబుతున్నారు. ఫస్టాఫ్ లో పాత్రల పరిచయం.. లవ్ ట్రాక్ చూపించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడట.. ఆ తర్వాత సెకండాఫ్ మిస్టరీ కేసును ఛేదించే సీన్లతో కాసింత ఉత్కంఠ భరితంగా సాగుతుందని సమాచారం.

గోపీచంద్, రాశీఖన్నా సహా కొందరు నటుల యాక్టింగ్ ఇరగదీశారట.. బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అయితే కామెడీ పేలకపోవడం.. థ్రిల్ మిస్ కావడం.. లాజిక్ లేని సీన్లు మైనస్ గా ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ మూవీ కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. యాక్షన్, కామెడీని చూపించే ప్రయత్నం చేసినా ఇది పెద్దగా వర్కౌట్ కానట్లు ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. ఇది అన్ని వర్గాలు చూసే సినిమాగా చెబుతున్నారు.


Recommended Videos