https://oktelugu.com/

Google Search 2024: ఈ ఏడాది ఇండియన్స్ గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాలు ఏంటో తెలుసా?

గూగుల్ ప్రతీ ఏడాది ఎక్కువగా ఏ విషయాలు సెర్చ్ చేశారో విడుదల చేస్తుంది. ఈ ఏడాది మరో 20 రోజుల్లో పూర్తి కావస్తుంది. ఈ క్రమంలో 2024లో ఇండియన్స్ ఎక్కువగా గూగుల్‌లో ఏ విషయాలు గురించి సెర్చ్ చేశారో.. ఆ లిస్ట్‌ను విడుదల చేసింది. మరి ఆ లిస్ట్ ఏంటో తెలియాలంటే ఆర్టికల్‌‌పై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2024 / 07:55 PM IST

    Google

    Follow us on

    Google Search 2024: రోజూ గూగుల్‌లో ఏదో ఒక విషయం గురించి సెర్చ్ చేస్తూనే ఉంటాం. కేవలం మనమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక విషయం గురించి అందరూ సెర్చ్ చేస్తూనే ఉంటారు. పొరపాటున మనకి ఏదైనా సందేహం వస్తే చాలు.. ఒక్క క్షణం ఆలోచించకుండా గూగుల్‌నే అడుగుతాం. కనీసం పక్కన ఎవరు ఉన్నా కూడా వారిని అడగం. ఎందుకంటే గూగుల్ అయితే అసలు తప్పు చెప్పకుండా కరెక్ట్ చెబుతాదని భావిస్తారు. అయితే గూగుల్ ప్రతీ ఏడాది ఎక్కువగా ఏ విషయాలు సెర్చ్ చేశారో విడుదల చేస్తుంది. ఈ ఏడాది మరో 20 రోజుల్లో పూర్తి కావస్తుంది. ఈ క్రమంలో 2024లో ఇండియన్స్ ఎక్కువగా గూగుల్‌లో ఏ విషయాలు గురించి సెర్చ్ చేశారో.. ఆ లిస్ట్‌ను విడుదల చేసింది. మరి ఆ లిస్ట్ ఏంటో తెలియాలంటే ఆర్టికల్‌‌పై ఓ లుక్కేయండి.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్
    ఇండియన్స్ ఎక్కువగా గూగుల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి సెర్చ్ చేశారు. ప్రతీ ఏడాది జరిగే ఐపీఎల్ మీద ఆసక్తితో ఇవే సెర్చ్ చేశారట. ఐపీఎల్ అన్ని టీమ్‌ల వివరాలు, ప్లేయర్స్, వేలంలో ఎంతకీ పలికారు, ఏ ఫ్రాంఛైజీకి ఎవరు కెప్టెన్ అనే విషయాల గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారట.

    టీ20 వరల్డ్ కప్
    ఇండియన్స్ ఐపీఎల్ తర్వాత ఎక్కువగా గూగుల్‌లో టీ20 వరల్డ్ కప్ గురించి సెర్చ్ చేశారట. వరల్డ్ కప్ గురించి పూర్తి వివరాలు, మ్యాచ్, స్కోర్ వివరాలు అనేక విషయాల గురించి ఇండియన్స్ సెర్చ్ చేశారట.

    భారతీయ జనతా పార్టీ
    ఇండియన్స్ ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేసిన దానిలో భారతీయ జనతా పార్టీ మూడవ స్థానంలో నిలిచిది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ఫలితాలు, బీజేపీ పార్టీ విధి విధానాలు, వాటి ప్రకటనల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారట.

    ఈ ఏడాది ఎన్నికల ఫలితాలు
    ఎన్నికలు ఈ ఏడాది జరగడంతో వాటి రిజల్ట్స్, ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారనే విషయాలపై ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేశారట.

    ఒలింపిక్స్
    ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిలో ఐదవ స్థానంలో ఒలింపిక్స్ ఉంది. భారతీయ అథ్లె‌ట్‌లు అయిన వినేష్ ఫోగట్, నీరజ్ చోప్రా వంటి వారి గురించి ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేశారట.

    టెంపరేచర్
    ఈ ఏడాది ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిలో టెంపరేచర్ ఆరవ స్థానంలో ఉంది. దేశంలో ఉష్ణోగ్రతల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సెర్చ్ చేశారు.

    రతన్ టాటా
    పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. అతని గురించి తెలుసుకోవాలని చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేశారు. టాటా వ్యాపారాలు, అతను చేసిన మంచి పనులు, అన్ని విషయాల గురించి సెర్చ్ చేశారు.

    ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
    ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గురించి ఈ ఏడాది చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేశారు. గూగుల్ సెర్చ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విధానాలు , పార్టీ వ్యూహాలు, నాయకత్వం గురించి ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేశారు.

    ప్రో కబడ్డీ
    గూగుల్ సెర్చ్‌లో ప్రో కబడ్డీ తొమ్మిద స్థానంలో నిలిచింది. ప్రో కబడ్డీ లీగ్స్ గురించి తెలుసుకోవాలని గూగుల్ సెర్చ్ చేశారు.

    ఇండియన్ సూపర్ లీగ్
    ఇండియన్ సూపర్ లీగ్ గూగుల్ సెర్చ్‌లో పదో స్థానాన్ని సంపాదించుకుంది.