Google Doodle Pani Puri: పానీపూరి ఈ పేరు తెలియని వారుండరు. ఈ స్నాక్ అంటే భారతదేశంలోని ప్రజలకు విపరీతమైన ఇష్టం. ఈ దేశీయ స్నాక్‌కు అనేక రకాల పేర్లున్నాయి. ఓ దగ్గర పానీపూరీ అని మరో దగ్గర పుచ్కా అని ఇంకో దగ్గర గోల్ గప్పా అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. పేరు ఏదైనా టేస్ట్ మాత్రం సూపర్ అని తింటూ ఉంటారు ఫుడ్ లవర్స్. ప్రస్తుత వర్షాకాలంలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదనుకోండి. ప్రధాని నరేంద్ర మోడీనే ఇతర దేశ ప్రధానులకు, రాయబారులకు ఈ తినుబండారాన్ని రిఫర్ చేస్తున్నారంటే ఈ పుచ్కాకు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి డిమాండ్ ఉన్న స్నాక్ ని ప్రపంచంలోని వివిధ ఆర్గనైజేషన్లు గుర్తించి పలువురు వ్యాపారులకు ఈ గోల్ గప్పాను డిఫరెంట్ గా విక్రయిస్తున్నందుకు గానూ పలు అవార్డులు, రివార్డులను కూడా అందజేశాయి. మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ పానీపూరిని ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగదారుల సెర్చింగ్ సైట్ అయిన గూగుల్ తల్లి మాత్రం ఎందుకు గుర్తించదు చెప్పండి. అందుకే పానీపూరి ఏకంగా గూగుల్ లోకి చొరబడింది. అదేంటి అనుకుంటున్నారు కదా ఇవ్వాళ ఒకసారి గూగుల్ ఓపెన్ చేస్తే అక్కడ అన్నీ పానీపూరీలే దర్శనమిస్తున్నాయి. మరి ఈ రోజే ఎందుకు ఇలా కనపడుతున్నాయో తెలుసుకోవాలని ఉందా అయితే ఈ కథనంపై ఓ లుక్కేసుకోండి.
దక్షిణాసియాలో ఎంతో పాపులర్ అయిన స్ట్రీట్ ఫుడ్ లో ఒకటి పానీపూరి. ఇందులో చాలా రకాలున్నాయని, పానీపూరీ ప్రాముఖ్యాన్ని తెలియజేసింది డూడుల్. అయితే గూగుల్ జూలై 12న పానీపూరీ డేని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా గూగుల్ పానీపూరి ఇంటరాక్టివ్ గేమ్ ని పరిచయం చేసింది. అసలు డూడుల్ పానీ పూరీ డేని ఎందుకు జకుపుకుంటందన్న విషయానికొస్తే..
2015లో జూలై 12న మధ్యప్రదేశ్ లోని ఇండోరి జైకా అనే రెస్టారెంట్ తన కస్టమర్లకు వెరైటీగా ఏదైనా అందిచాలనే ఉద్దేశ్యంతో 51రకాల ప్రత్యేకమైన పానీ పూరీలను తయారుచేసింది. ఈ పానీపూరీలకు స్థానిక ప్రజలు ఫిదా అయ్యి క్యూ కట్టారు. అంతే ఇంకేముంది ఇలా పానీపూరి సర్వ్ చేసి ఆ రెస్టారెంట్ ఓ రికార్డు సృష్టించింది. అందుకు గుర్తుకు గూగుల్ ఈ రోజును పానీపూరి డేగా సెలబ్రేట్ చేస్తున్నట్టు గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం తెలుస్తోంది.
దేశంలోనే చిన్న నుంచి పెద్ద వరకు అత్యంత ఎక్కువ మంది ఎంతో ఇష్టంగా తినే ఈ చిరుతిండి గురించి చాలా మందికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఎన్బీటీ ప్రకారం దీని మార్కెట్ విలువ సుమారు రూ.6కోట్ల పైమాటేనంట. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక గంటలో 4వేల పానీపూరీలు తయారు చేయవచ్చు. వీటితో కనీసం రూ.800 నుంచి రూ. 900 వరకు ఈజీగా సంపాదించవచ్చని చెప్తున్నారు. వ్యాపారులు కనీసం 8 గంటలు పానీపూరీ బిజినెస్ చేస్తే రోజుకు రూ.6 నుంచి 7వేల వరకు సంపాదించవచ్చని గణాంకాలు చెప్తున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒక చిరువ్యాపారి ఒక రోజుకు రూ.6 నుంచి 7వేలు సంపాదిస్తే అతని సగటు ఆదాయం ఎంతై ఉండొచ్చు మినిమం ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయి కూడా అంత డబ్బు సంపాదించలేమో అనిపిస్తుంది కదా అదండి అట్లుంటది మరి పానీపూరీ తోటి.