
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవలకు గాను మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధంచి టికెట్లను బుధవారం నుంచి విడుదల చేసింది. దీంతో వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆ్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు http://tirupatibalaji. ap. gov. in వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని చెబుతోంది. దీంతో భక్తులు తమకు కావాల్సిన రోజుల్లో టికెట్లు బుక్ చేసుకుని ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవాలని తెలిపింది.
బుధవారం సాయంత్రం నుంచి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆన్ లైన్ లక్కీడీప్ ద్వారా ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటల వరకు సమయం ఇచ్చినట్లు పేర్కొంది. లక్కీడీప్ లో టికెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించి తమ టోకెన్లు ఖరారు చేసుకోవాలని చెబుతోంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ తో పాటు జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఏర్పాటు చేసిన యాప్ తో టికెట్లు సులభంగా పొందాలని సూచిస్తోంది.
ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని వచ్చే మూడు నెలల్లో సేవా టికెట్లను పొందాలని అవకాశం కల్పిస్తోంది. టీటీడీ దేవస్థానం మొబైల్ అప్లికేషన్ ద్వారా సులభంగా టికెట్లు బుక్ చేసుకుని స్వామి వారిని దర్శనం చేసుకుని తరించాలని ఆశిస్తోంది. ఇందులో భాగంగానే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. టికెట్లు బుక్ చేసుకుంటే సులభంగా స్వామి దర్శనం ఇతర వసతులు పొందే అవకాశం ఉంటుంది. దీనికి గాను టీటీడీ ముందస్తు ప్రణాళిక రచించి భక్తులకు ఊరట కల్పించనుంది.

టీటీడీ సేవల టికెట్లను సామాన్య భక్తులకు సైతం కష్టాలు కలిగించొద్దనే ప్లాన్ తోనే ఇలా ముందే టికెట్లు బుకింగ్ కు చర్యలు తీసుకుంది. సేవా టికెట్లను కొనుగోలు చేసుకుని భక్తులు ఎండాకాలంలో ప్రశాంతంగా దర్శనం చేసుకుని స్వామి వారి సేవలో తరించాలని భావిస్తోంది. ఈ మేరకు యాప్ డౌన్ లోడ్ చేసుకుని వచ్చే మూడు నెలల కాలంలో ఎప్పుడు వీలవుతుందో అప్పుడే టికెట్లు బుక్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టీటీడీ తీసుకున్న నిర్ణయంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.