
జబర్ధస్త్ యాంకర్ అనసూయ ఎంత జోష్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె హావభావాలు, నవ్వులు, అందాలు వీక్షకులకు కనువిందు చేస్తాయి. ప్రతివారం జబర్ధస్త్ లో అనసూయ చేసే సందడి అంతా ఇంతా కాదు.. తాజాగా బజర్ధస్త్ ప్రోమో విడుదలైంది. ఇందులో సుధీర్-హైపర్ ఆది స్కిట్ లో భాగంగా అనసూయ వాడిన పదం చూసి అందరూ షాక్ అయ్యాడు.
అదిరే అభి స్కిట్లో ఒక ప్రశ్నగా ‘గుర్రం వెనుకాల ఉండేది ఏంటి?’ అని ఆది అడిగితే ‘గూ..’ అంటూ బూతు పదాన్ని మింగేసింది. ఆ గూ అనేది మాత్రమే బయటకు వచ్చింది. దీంతో అభి సైతం.. ‘అనసూయ’ ఏంటీ బూతు మాటలు అని అడిగేస్తాడు. ఇప్పుడా జబర్ధస్త్ ప్రోమో వైరల్ గా మారిందిన
ఈ వీడియోలో అనసూయ వాడిన పదం దుమారం రేగుతోంది. నెట్టింట్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వచ్చిన షో ల్లో బూతులు వాడడం కొత్తేమీ కాదు. కానీ అనుకోకుండా అనసూయ నోటి ద్వారా ఈ పదం పలకడంతో అందరూ షాక్ అవుతున్నారు.
వచ్చేవారం ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో అదిరే అభి స్కిట్ చేసింది. స్కిట్లో భాగంగా అభి ‘గుర్రానికి ముందుకు ఉండేది.. ఏనుగుకు వెనుక ఉండేది ఏంటిది..?’ అని అడిగాడు. అయితే వెంటనే అనసూయ అందులో దూరి ‘గు..’ అనగానే డైలాగ్ కట్ చేసి పలుకుతుంది. వెంటనే అభి రియాక్ట్ అవుతూ ఏం మాట్లాడుతున్నావ్..? అంటూ అనసూయ వైపు తిరుగుతాడు.
అనసూయ వాడిన ఆ పదానికి అక్కడున్న జడ్జిలు షాక్ అవుతారు. నటులు కూడా ఆందోళనగా చూస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. అయితే ఈ ఎపిసోడ్ ప్రసారం అయితే ఏవిధంగా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా షో కోసం ఎదురుచూస్తున్నారు.