India vs New Zealand: టి20 మెన్స్ వరల్డ్ కప్ సెమీస్ ఓటమి తర్వాత భారత క్రికెటర్లు, అభిమానులు డీలా పడ్డారు. ఇది జరిగి వారం అయిందో కాలేదో గాని అప్పుడే న్యూజిలాండ్ సిరీస్ వచ్చేసింది.. ఆ దేశంతో భారత్ టి20, వన్డే మ్యాచ్లు ఆడబోతోంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతోంది.. సెమిస్ ఓటమి తర్వాత అనేక గుణపాఠాలు నేర్చుకున్న టీమిండియా ఈసారి యువతరాన్ని రంగంలోకి దించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్, బుమ్రా, డీకే వంటి వారు లేకుండానే బరిలోకి దిగుతోంది. పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.. శుభ్ మన్ గిల్, సంజు సాంసంన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కీలక ఆటగాళ్ళుగా ఉన్నారు.

అవకాశం ఎవరికి ఇస్తారు
టి20 మెన్స్ వరల్డ్ కప్ లో భారత్ ఆర్ మ్యాచ్ లు ఆడింది. వీటిలో సీనియర్ లెగ్ స్పిన్నర్ చాహల్ కు ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియా మైదానాలు లెగ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటాయని మాజీ క్రికెటర్లు చెప్పిన భారత కెప్టెన్ రోహిత్, ద్రవిడ్ అటువైపుగా ఆలోచన చేయలేదు. డెత్ ఓవర్లలో అండగా నిలుస్తాడు అనుకొని ఎంపిక చేసిన హర్షల్ పటేల్ కు అవకాశం ఇవ్వలేదు. న్యూజిలాండ్ t20 సిరీస్ లో వీరికి అవకాశం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. టి20 ఫార్మాట్లో లెగ్ స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారని అజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత ఫాస్టెస్ట్ బౌలర్ గా మారిన ఉమ్రాన్ మాలిక్ ఎట్టకేలకు జాతీయ జట్టులో మళ్లీ చోటు సంపాదించాడు.. కుల్దీప్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.. ఆల్ రౌండర్లు దీపక్, శార్దూల్ అవకాశం కోసం వేచి చూస్తున్నారు.

న్యూజిలాండ్ జట్టులో ..
పొట్టి కప్ లో ఒకరిద్దరు మినహా బరిలోకి దిగిన జట్టుతోనే టి20 సిరీస్ కు న్యూజిలాండ్ ఎంపిక చేసింది . ట్రెంట్ బౌల్ట్ కు విశ్రాంతి ఇచ్చింది. ఫిన్ అలెన్, బ్రాస్ వేల్, డేవన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, జీమ్మి నీషమ్ ను ఎంపిక చేసింది. సౌథీ, సాంట్నర్, మిల్నే, సోధి, ఫేర్గూసన్ తో కూడిన బౌలింగ్ లైనప్ అత్యంత ప్రమాదకరం. ఇంకా ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ 20 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 11 మ్యాచ్లో గెలిచింది. న్యూజిలాండ్ 9 మ్యాచ్లో విజయం సాధించింది. భారత్ వేదికగా జరిగిన మైదానాల్లో భారత్ ఐదు మ్యాచ్ల్లో, న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్లో విజయం సాధించింది. కివీస్ వేదిక భారత్ ఆర్ మ్యాచ్లో, న్యూజిలాండ్ మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. తటస్థ వేదికలో జరిగిన రెండు మ్యాచ్లనూ న్యూజిలాండ్ గెలిచింది.