
Godavari Express Incident: గోదావరి ఎక్స్ప్రెస్ రైలు నిన్న పట్టాలు తప్పింది.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఘోర ప్రమాదం తప్పింది.. లేకుంటే వందల కోట్లలో నష్టం వాటిల్లేది. ప్రాణ నష్టం కూడా సంభవించేది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ ట్రాక్ మరమ్మత్తులు చేపట్టింది. నష్ట నివారణకు నడుం బిగించింది.. రైల్వే శాఖ ఉద్యోగులు అక్కడే పనిచేస్తున్నారు.. పట్టాలు తప్పిన భోగిలను భారీ క్రేన్ల సహాయంతో తొలగించి, పట్టాలను సరిచేస్తున్నారు.

నిన్న సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంనకు గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ పరిధిలో పట్టాలు తప్పింది.. 400 మీటర్ల మీద ముందుకు వెళ్ళింది. ఘటనలో ఎస్ 4 నుంచి ఎస్ 1 వరకు స్లీపర్ క్లాస్ బోగీలు, మరో రెండు జనరల్ బోగీలు కలిపి మొత్తంగా ఆరు బోగీలు అదుపు తప్పాయి. రైలు పెద్ద శబ్దంతో ఆగిపోవడం, దుమ్ము ధూళి కమ్మేయడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.. ఘటన జరిగిన ప్రాంతంలో పట్టాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భువనగిరి, బీబీ నగర్, ఘట్ కేసర్ రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను అధికారులు ముందస్తుగా నిలిపివేశారు. ఇక నిన్నటి ప్రమాదం జరిగిన దగ్గర నుంచి పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి..

రైళ్ళను పునరుద్ధరించేందుకుట్రాక్ మరమ్మతులు వేగంగా సాగుతున్నాయి.. ఈ పనుల్లో కొన్ని వందల మంది
పాల్గొంటున్నారు.. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను పాక్షికంగా, మరికొన్ని రైళ్ళను పూర్తిగా రద్దు చేసింది. సుమారు 400 మంది దాకా సిబ్బంది వచ్చి ఆరు బోగిలను రైలు నుంచి విడదీసి సరి చేశారు.. 9 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.. మరో పంతొమ్మిది రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఏడు రైళ్ళ సమయాన్ని మార్చేశారు.. మరో ఆరు రైళ్లను దారి మళ్లించారు.