Illegal Affair: అక్రమ సంబంధాలు సక్రమమైనవి కావని తెలిసినా మానలేరు. వాటి వెంటే పరుగులుపెడుతున్నారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నారు. నిండు జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మరో హత్య జరిగింది. నిండు నూరేళ్లు బతకాల్సిన యువవకుడిని గొంతు కోశారు. చివరకు నిందితులు కటకటాలపాలయ్యారు. క్షణికావేశంలో హత్య చేసి జీవితాంతం జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనిషి కుదురుగా ఉండలేకే ఇలాంటి వాటిలో చిక్కుకుని తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు.

చత్తీస్గడ్ రాష్ట్రంలోని జష్ పూర్ లో యువకుడి హత్య సంచలనం సృష్టించింది. జిల్లాలోని నారాయణ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంతల సుఖ్ బాసుపర బెల్టోలి కాచి మార్గ్ కల్వర్టు సమీపంలో సోనూ యాదవ్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. అతడిని హత్య చేసి అక్కడ పడేసినట్లు గుర్తించారు విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. హతుడికి అక్రమ సంబంధం ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. కట్ చేస్తే మృతుడు తరచూ బండిపమొహల్లాకు వెళ్లే వాడని ఈ క్రమంలో అక్కడ సావిత్రి బాయి చౌహాన్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
Also Read: AP Cabinet Expansion: ఏపీలో కొత్త మంత్రివర్గంపై కొనసాగుతున్న కసరత్తు
దీంతో విషయం కాస్త భర్తకు తెలిసి సోనూయాదవ్ తో గొడవ పడ్డాడు. తన భార్య వంక చూడొద్దని హెచ్చరించాడు అయినా సోనూ యాదవ్ తీరు మార్చుకోలేదు దీంతో అతడి హత్యకు సావిత్రి భర్త లలిత్ రామ్ చౌహాన్ కుట్ర పన్నాడు. ఇదే క్రమంలో సోనూ యదవ్ సావిత్రికి ఓ ప్రీపెయిడ్ మొబైల్ ఇచ్చి మనం ఇంటి నుంచి పారిపోదామని ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ విషయం సావిత్రి భర్తకు చెప్పింది. దీంతో అతడు ఇదే సందర్భమని భావించి సోనూ హత్యకు పథకం పన్నాడు అతడిని కల్వర్టు ప్రాంతానికి రావాలని చెప్పమన్నాడు.

వీరిద్దరు పథకం ప్రకారం సోనూను హత్య చేసేందుకు ఆయుధాలతో వెళ్లారు. అతడు తన వాహనంపై అక్కడికి చేరడంతో తలపై బలంగా కొట్టి ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసి చంపారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయి. దీంతో భార్యాభర్తలిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. క్షణికావేశంలో హత్య చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని తెలుసుకోవాలి.
Also Read:Pawan Kalyan: ఏపీలో అధికారమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు