The Ghost Review:: అక్కినేని నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’..ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి..టీజర్ మరియు ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడం తో నాగార్జున కి చాలా కాలం తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుందని అందరూ అనుకున్నారు..నాగార్జున గారికి కూడా ఈ సినిమా మీద గట్టి నమ్మకం ఉండేది..అందుకే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమా తో కూడా పోటీకి దిగడానికి సిద్దమైపోయాడు..అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది..అయితే ఒక్కసారి ఈ సినిమా కథా కథనం మరియు నటీనటుల పెర్ఫార్మన్స్ ఎలా ఉందొ విశ్లేషిద్దాం.
కథ :
కథ విషయానికి వస్తే ఈ సినిమాలో నాగార్జున ఒక ఇంటర్ పోల్ ఆఫీసర్..రిస్క్ తో కూడిన మిషన్స్ ని డీల్ చెయ్యడం లో నాగార్జున దిట్ట..అలా హై ప్రొఫైల్ మైంటైన్ చేసే ఈ ఇంటర్ పోల్ ఆఫీసర్ ఒక ముఖ్యమైన మిషన్ లో ఫెయిల్ అవుతాడు..దాని ప్రభావం ఆయన జాబ్ పై గట్టిగా చూపుతుంది..అలా కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత హై ప్రొఫైల్ ఉన్న కుటుంబాలకు సెక్యూరిటీ గా ఉంటాడు..అలా ఒక కుటుంబానికి సెక్యూరిటీ గా ఉంటున్న సమయం లో ఆ ఇంటి పాపని కొంతమంది కిడ్నప్ చెయ్యాలని చూస్తారు..అసలు ఎందుకు వాళ్ళు ఆ ఇంటి పాపని కిడ్నప్ చెయ్యాలని చూసారు..కిడ్నప్ చెయ్యాలనుకున్న ఆ గ్యాంగ్ కి నాగార్జున తో ఫ్లాష్ బ్యాక్ లో ఎలాంటి సంబంధం ఉంది అనేది ఇక తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సినిమాలు అంటేనే రొటీన్ కి బిన్నంగా ఉంటాయి..అలా ముందుగానే ఫిక్స్ అయ్యి ఈ ఏ సినిమాకి వెళ్తే బాగా నచుతుంది,,ఎందుకంటే కథ పరంగా ఏ సినిమా అంత గొప్పదేమీ కాదు..యాక్షన్ సన్నివేశాలు మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది..నాగార్జున గారిని ఇంత పవర్ ఫుల్ గా ఈమధ్య కాలం లో ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఇక ఈ సినిమాలో నాగార్జున నే ప్రధాన హైలైట్..శివ సినిమా లో నాగార్జున గారు ఎంత పవర్ ఫుల్ గా కనిపిస్తారో..ఈ సినిమాలో కూడా ఆయన అదే రేంజ్ లో కనిపిస్తాడు..లుక్స్ పరంగా కూడా నాగార్జున ముందు సినిమాలతో పోలిస్తే ఇందులో ఇంకా అందంగా కనిపిస్తాడు..ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో ఆయన ఈ వయస్సులో కూడా అంత అద్భుతంగా నటించాడు అంటే మాములు విషయం కాదు..ముఖ్యంగా చర్చి ఫైట్ లో అయితే మనం నాగార్జున గారి విశ్వరూపం చూడొచ్చు.
హీరోయిన్ సోనాల్ చౌహన్ కూడా బాగానే నటించింది..యాక్షన్ సన్నివేశాలన్నీ అద్భుతంగా అనిపించినప్పటికీ కూడా కథ మరియు కథనం ఆసక్తికరంగా లేకపోవడం వల్ల సినిమా యావరేజి గా అనిపిస్తాది..డైరెక్టర్ యాక్షన్ సన్నివేశాలు మీద పెట్టిన శ్రద్ద కథ విషయం లో పెట్టలేదని అనిపిస్తాది..కానీ యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడేవాళ్ళకి మాత్రం ఈ మూవీ ఫీస్ట్ లాగానే ఉంటుంది..సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా వచ్చింది..సాంకేతిక పరంగా తక్కువ బడ్జెట్ తోనే హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాని చూస్తున్నామా అనే ఫీల్ ని రప్పిస్తుంది ఈ చిత్రం.
రేటింగ్ : 2.5 /5