Garuda Vega Producer: ప్రముఖ సినీ జంట జీవితా రాజశేఖర్ పై నిర్మాత, జ్యో స్టార్ గ్రూపు ఎండీ హేమా, కోటేశ్వరరాజు చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. జీవిత రాజశేఖర్ ఒక పెద్దా మహానటీ అని వాళ్లు ఆడిపోసుకున్నారు. జీవిత రాజశేఖర్ మమ్మల్ని చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు.
ఎవరండి జీవితా రాజశేఖర్ పాతకాలపు ఓ సీనినటీ.. ప్రజలను అబద్ధాలతో పెద్దమనిషుల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. మొదట అసలు మేము ఎవరో కూడా తెలియదు అన్నారు… నిన్న మా గురించి మాట్లాడారని హేమా కోటేశ్వరరాజు ఆరోపించారు.పరువుగల కుటుంబ నుండి వచ్చామని.. లిమిట్స్ క్రాస్ చేసి మాగురించి మాట్లాడారని విమర్శించారు.
జీవిత రాజశేఖర్ నోరు అదుపులో పెట్టుకో… కోర్టులో మేము విజయం సాధిస్తామని.. జ్యో స్టార్ గ్రూపు కోటేశ్వరరాజు హెచ్చరించారు. అధారాలతో సహా మేము కోర్టులో సమర్పించామన్నారు. సెలబ్రేటీకి ఒక లైఫ్ … సామాన్యుడికి ఒక లైఫ్ ఉంటుందా అని ప్రశ్నించారు. సెలబ్రేటి పేరుతో మోసాలు చేస్తోందని ఆరోపించారు.
జీవిత రాజశేఖర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోందని.. జీవిత రాజశేఖర్ 420 గాళ్ళు… అది ప్రజలకు చెప్పామన్నారు. మేము గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బును ఒక్కరూపాయి తీసుకోలేదని స్పష్టం చేశారు.
గరుడవేగ సినిమా కోసం జీవితా రాజశేఖర్ మా దగ్గర అప్పు తీసుకుందా? లేదా? అని చెప్పాలని హేమా, కోటేశ్వరరాజు డిమాండ్ చేశారు. అప్పు కోసం ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టారా? లేదా? చెప్పాలని కోరారు. గరుడ వేగ సినిమా విడుదలైన వెంటనే జీవిత తిరిగి డబ్బులు చెల్లించలేకపోయిందని.. దీంతో రాజశేఖర్ తండ్రి సమక్షంలో ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టుకొని అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. అసలు మాకు డబ్బులు ఇవ్వమని.. ఏం చేస్తారో చేసుకోండని జీవితా మమ్మల్ని బెదిరించిందంటూ కోటేశ్వరరాజు సంచలన కామెంట్స్ చేశారు. జీవిత పై గరుడవేగ నిర్మాత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.