Rashmika Mandanna Remuneration: దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న హీరోయిన్స్ లో రష్మిక ఒకరు. ఇటు సౌత్ తో పాటు నార్త్ ని ఆమె ఊపేస్తోంది. ఆమె చేతిలో ఉన్నవన్నీ బడా చిత్రాలే. పుష్ప 2 పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 భారీ విజయం సాధించగా సీక్వెల్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అలాగే విజయ్ కి జంటగా వారసుడు మూవీలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతి కానుకగా వారసుడు విడుదల కానుంది. రష్మీక నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ యానిమల్.

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రానికి దర్శకుడు. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా యానిమల్ తెరకెక్కుతుంది. నిజమైన వైలెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తా అని సందీప్ రెడ్డి వంగా చెప్పడం ఉత్కంఠ రేపుతోంది. రష్మిక నటిస్తున్న ఈ మూడు చిత్రాలపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఒక ప్రక్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ… ఐటం సాంగ్స్ కి కూడా రెడీ అంటుందట రష్మిక మందాన.
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ మూవీ గురించి అనేక ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు అంటున్నారు. అలాగే సీనియర్ నటి శోభన మహేష్ తల్లి పాత్ర చేస్తున్నారట. స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసిన టీమ్ పాన్ ఇండియా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారట.

కాగా త్రివిక్రమ్ తన గత చిత్రాలకు భిన్నంగా ఒక మాస్ మసాలా ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ లో మహేష్ తో స్టెప్స్ వేసేందుకు రష్మిక మందానను ఎంచుకున్నారనేది హాట్ టాపిక్. కొద్దిరోజులుగా ఈ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మరొక ఆసక్తికర వార్త ఏమిటంటే… ఐటెం సాంగ్ చేయడానికి ఇబ్బందేమీ లేదన్న రష్మిక… సింపుల్ గా ఒక రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందట. సినిమాకు మూడు నాలుగు కోట్లు తీసుకుంటున్న రష్మిక ఐటెం సాంగ్ కి ఐదు కోట్లు అడగ్గాన్నే నిర్మాతల ఫ్యూజులు ఎగిరిపోయాయట.
దీంతో సందిగ్ధంలో పడ్డారట. ఎంత గ్రాండ్ గా తెరకెక్కించినా ఒక ఐటెం సాంగ్ షూట్ కి 3-5 రోజులు పడుతుంది. ఆ లెక్కన రోజుకు రష్మిక కోటి రూపాయల పైనే అడిగారన్న మాట. స్టార్ హీరో రేంజ్ లో డిమాండ్ చేసిన రష్మిక తీరుకు ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.