
Akhil Agent Release Date: ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం అఖిల్ అక్కినేని తన కెరీర్ మొదలు పెట్టాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా ముందు వరకు ఒక్కటంటే ఒక్క సినిమా హిట్ కాలేదు. సినిమాల కంటే ఆయన ఇతర విషయాలతోనే వార్తల్లో వ్యక్తిగా ఉండేవారు. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ తో రెండు సంవత్సరాల పాటు డేటింగ్ చేశాడు. శ్రియా భూపాల్ వయసులో అఖిల్ కంటే నాలుగు సంవత్సరాలు పెద్దది. అయినప్పటికీ అఖిల్ నిర్ణయం వైపు నాగార్జున మొగ్గు చూపించాడు. వారిద్దరికీ ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా చేశాడు. కానీ రెండు కుటుంబాల మధ్య గొడవ జరగడంతో ఆ ఎంగేజ్మెంట్ కాస్త క్యాన్సిల్ అయిపోయింది.
ఇక ఆ తర్వాత కెరియర్ మీద బాగా ఫోకస్ పట్టిన అఖిల్.. మజ్ను అనే సినిమా తీస్తే అది దారుణంగా ఫెయిల్ అయింది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మాతగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎట్టకేలకు అఖిల్ కు ఒక హిట్ తీసుకొచ్చింది. ఈ ఊపులో అఖిల్ కొత్త సినిమా కమిట్ అయ్యాడు. దానికి టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా పేరే ఏజెంట్. ఈ సినిమాలో అఖిల్ రగ్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా దానినే ధ్రువీకరించింది.
ఇక ఈ సినిమా నిర్మాణం ఎప్పుడో పూర్తయినప్పటికీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను విడుదల చేశారు. అవి యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ ను నమోదు చేశాయి. సాక్షి వైద్య అనే అమ్మాయి అఖిల్ కు జోడిగా నటిస్తోంది. చూడడానికి ఈ ఫెయిర్ చాలా బాగుంది. మలయాళ నటుడు మమ్ముట్టి ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇక ఏడాది మొదట్లోనే ఏజెంట్ సినిమా విడుదలవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి ఉండటంతో ఏజెంట్ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.. ఫిబ్రవరిలో విడుదలన్నారు, తర్వాత అది మార్చి కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ 28న విడుదల చేస్తామని నిర్మాతలు అంటున్నారు. దీనికి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ విడుదలను ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో అఖిల్ అక్కినేని, అతడు పట్టుకున్న తుపాకిని, అతని వెనుక వస్తున్న మంటలను చూపిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు.. 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అంటూ చిత్ర నిర్మాణ సంస్థ రాస్కొచ్చింది. దీంతో అఖిల్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు ఎట్టకేలకు అయ్యగారు వస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram