https://oktelugu.com/

Varsha Emmanuel: స్టేజిమీదే వ‌ర్ష‌, ఇమ్మాన్యూయెల్ మ‌ధ్య గొడ‌వ‌.. ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన న‌టి..

Varsha Emmanuel: ఈటీవీలో ప్ర‌సారం అయ్యే జ‌బ‌ర్ద‌స్త్‌, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల న‌టుల‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ షోల‌లో ల‌వ్ ట్రాక్ లు పెట్ట‌డం, వారి మ‌ధ్య కొన్ని ల‌వ్ సీన్ల‌ను, ఆ త‌ర్వాత ఎమోష‌న‌ల్ సీన్ల‌ను పెట్టేసి ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డం మొద‌టి నుంచి జ‌రుగుతున్న ప‌ద్ధ‌తే. సుధీర్‌-ర‌ష్మీ నుంచి ఇప్పుడు కొత్త‌గా వ‌ర్ష‌- ఇమ్మాన్యూయెల్ వ‌ర‌కు ఇలాంటివే జ‌రుగుతున్నాయి. అయితే ఈ ప్రేమ‌ప‌క్షుల మ‌ధ్య కొన్ని […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 14, 2022 / 04:36 PM IST
    Follow us on

    Varsha Emmanuel: ఈటీవీలో ప్ర‌సారం అయ్యే జ‌బ‌ర్ద‌స్త్‌, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల న‌టుల‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ షోల‌లో ల‌వ్ ట్రాక్ లు పెట్ట‌డం, వారి మ‌ధ్య కొన్ని ల‌వ్ సీన్ల‌ను, ఆ త‌ర్వాత ఎమోష‌న‌ల్ సీన్ల‌ను పెట్టేసి ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డం మొద‌టి నుంచి జ‌రుగుతున్న ప‌ద్ధ‌తే. సుధీర్‌-ర‌ష్మీ నుంచి ఇప్పుడు కొత్త‌గా వ‌ర్ష‌- ఇమ్మాన్యూయెల్ వ‌ర‌కు ఇలాంటివే జ‌రుగుతున్నాయి. అయితే ఈ ప్రేమ‌ప‌క్షుల మ‌ధ్య కొన్ని సార్లు గొడ‌వ‌లు కూడా జ‌రుగుతుంటాయి.

    Varsha Emmanuel

    గ‌తంలో ఇలాగే స్టేజీమీదే న‌టులు గొడ‌వ‌ప‌డ్డ సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా ఏదైనా ఫెస్టివ‌ల్ ఈవెంట్ జ‌రిగితే అందులోనే ఇలాంటివి ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయి. ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ లో వ‌ర్ష‌-ఇమ్మాన్యూయెల్ మ‌ధ్య‌ ఇలాంటి గొడ‌వే జ‌రిగింది. ఇన్ని రోజులు త‌మ ల‌వ్ ట్రాక్ తో జ‌నాల‌ను ఫుల్ ఎంట‌ర్ టైన్ చేసిన ఈ జంట‌.. మొద‌టి సారి గొడ‌వ ప‌డింది.

    Also Read: తెలుగు ప్రజెంట్ లేటెస్ట్ అప్ డేట్స్ !

    ఇదే ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. తాజాగా హోళీ ఈవెంట్‌లో వీరిద్ద‌రూ పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈటీవీ రిలీజ్ చేసిన ఈ ప్రోమోలో ఇద్ద‌రూ ఒక‌రి మీద ఒక‌రు అరుచుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వ‌ర్ష మీద చాలా సార్లు మ‌గాడిలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నాడు ఇమ్మాన్యూయెల్‌. ఈ హోలీ ఈవెంట్ లో కూడా అలాంటి కామెంట్లే చేశాడు. దీంతో చాలా సార్లు ఆ కామెంట్ ను లైట్ తీసుకున్న వ‌ర్ష‌.. ఈ సారి మాత్రం సీరియ‌స్ గానే తీసుకుంది.

    దీంతో ఇమ్మాన్యూయెల్ మీద చాలా సీరియ‌స్ అయింది. ఏకంగా స్టేజీ మీదే ఏడుస్తూ అరిచేసిన వ‌ర్ష‌.. స్టేజి కింద‌కు దిగి వెళ్లిపోయింది. అయితే ఇదంతా స్క్రిప్ట్ ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. చాలా సార్లు ఇలాంటివి చూశామ‌ని, కొత్త‌గా ఏదైనా ట్రై చేయండి అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజ‌న్లు. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలాంటివి ప్ర‌తిసారి చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు ప్రేక్ష‌కులు. అయితే అస‌లు గొడ‌వ ఏం జ‌రిగిందో తెలియాలంటే మాత్రం హోలీ ఈవెంట్ వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

    Also Read: ‘సాంకేతికత – ప్రకృతి’ కలిసే చోటులో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ !

    Tags