Shruti Haasan: శృతి హాసన్ లేటెస్ట్ లుక్ షాక్ ఇస్తుంది. ఆమె ముఖం ఎర్రగా కంది వాసిపోయినట్లుంది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శృతిని చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమె తన లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. శృతి హాసన్ జ్వరం, సైనస్ సమస్యతో బాధపడుతున్నారట. అలాగే స్త్రీలకు రుతుస్రావం రావడానికి ముందు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. శృతి హాసన్ ప్రజెంట్ ఆ బాధలు కూడా ఫేస్ చేస్తున్నారట. ఈ సమస్యల కారణంగా నా లుక్ ఇలా తయారైంది. అయినప్పటికీ మీకు నచ్చుతుందని, అంగీకరిస్తారని నేను నమ్ముతున్నాను, అంటూ సదరు ఫోటోలకు శృతి హాసన్ వివరణ ఇచ్చారు.

ఆమె లుక్ మాత్రం ఆందోళన కలిగించేదిగా ఉంది. శృతి వివరణ అర్థం చేసుకున్న ఫ్యాన్స్ సమస్య చిన్నదేలే అని ఊపిరి పీల్చుకుంటున్నారు. తెలియనివారు ఆందోళన చెందుతున్నారు. ఇక హీరోయిన్స్ నందు శృతి హాసన్ వేరయా అన్నట్లు.. ఆమె తీరే వేరు. చాలా బోల్డ్ గా ఉంటుంది. మనసుకు నచ్చింది చేస్తుంది. సొసైటీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఐ డోంట్ కేర్ అంటుంది. ప్రస్తుతం ఆమె ప్రియుడితో పాటు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు శ్రుతి లండన్ ప్రియుడు మైఖేల్ మోజులో పడి పరిశ్రమను పక్కన పెట్టింది. 2019లో అతడు బ్రేకప్ చెప్పడంతో మళ్ళీ ఇండియా వచ్చి ఆఫర్స్ వెతుకున్నది. శృతి టైం బాగుంది… మరలా క్రేజీ ఆఫర్స్ దక్కాయి. శృతి ప్రస్తుతం మూడు బడా ప్రాజెక్ట్స్ లో భాగమయ్యారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి.

ఇక ప్రభాస్ కి జంటగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఈ మూవీలో శృతి అనూహ్యంగా ఛాన్స్ దక్కించుకుంది. చిత్రీకరణ జరుపుకుంటున్న సలార్… వచ్చే ఏడాది విడుదల కానుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. సలార్ బాక్సాఫీస్ రికార్డ్స్ షేక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి. సలార్ విజయం సాధిస్తే శృతి పేరు కూడా ఇండియా వైడ్ మారుమ్రోగుతుంది.