https://oktelugu.com/

Konchada Srinivas: విషాదం: ప్రముఖ తెలుగు నటుడు మృతి !

Konchada Srinivas: సినిమా పరిశ్రమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ నటుడు మృతి చెందాడు. టాలీవుడ్ నటుడు కొంచాడ శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 47 సంవత్సరాలు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం పలాస. కాగా పలాసలోనే ఆయన కన్నుమూశాడు. గతంలో షూటింగ్‌ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ బలంగా తగిలింది. ఆ తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక, శ్రీనివాస్‌ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా […]

Written By: , Updated On : January 20, 2022 / 10:56 AM IST
Follow us on

Konchada Srinivas: సినిమా పరిశ్రమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ నటుడు మృతి చెందాడు. టాలీవుడ్ నటుడు కొంచాడ శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 47 సంవత్సరాలు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం పలాస. కాగా పలాసలోనే ఆయన కన్నుమూశాడు. గతంలో షూటింగ్‌ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ బలంగా తగిలింది. ఆ తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక, శ్రీనివాస్‌ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్‌లో నటించాడు.

Konchada Srinivas

Konchada Srinivas

అయితే, కొంచాడ శ్రీనివాస్ కి ప్రధాన పాత్రలు దొరకలేదు. ఆయన ఎక్కువగా జూనియర్ ఆర్టిస్ట్ గానే నటించారు. కాకపోతే.. ఆది, శంకర్‌దాదా MBBS, ప్రేమకావాలి వంటి సినిమాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఆయన సినీ ప్రస్థానం కూడా ఎంతో విభిన్నంగా సాగింది. ఎన్నో కష్టనష్టాల మధ్య పలు రకాలుగా ఆయన సినీ ప్రస్థానం సాగుతూ వచ్చింది.

Also Read: నన్ను ఎంతో ప్రేమించావు.. చిరంజీవి చిన్న కుమార్తె ఎమోషనల్ పోస్ట్ !

కాగా గత కొన్ని రోజులుగా గుండెకు సంబంధించిన ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవటం ఆయన కుటుంబానికి తీరని లోటు. కొంచాడ శ్రీనివాస్ మృతితో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి వరుస షాకులు మీద షాక్ లు తగులుతున్నాయి.

మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున కొంచాడ శ్రీనివాస్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Also Read: లతా మంగేష్కర్ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ !

Tags