Mihir Das: ప్రముఖ స్టార్ హీరో మిహిర్ దాస్ ఇక లేరు. ఆయన కటక్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. మిహిర్ దాస్ తుదిశ్వాస విడిచారు అని తెలియగానే.. ఓలీవుడ్ తల్లడిల్లిపోయింది. ఒడిశా సినీ కళాకారులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. మిహిర్ దాస్ కి ఇటీవల గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అయితే, ఆయనకు అవయవాలు వైఫల్యం అయ్యాయని దాంతో ఆయన చనిపోయారని డాక్టర్స్ చెప్పారు.
మొదట వెంటిలేటర్‌పై చికిత్స అందించే సమయంలో ఆయన కోలుకుంటున్నట్లు కనిపించారు, అయితే, ఆ తర్వాత మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. ఇక తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని వైద్య వర్గాలు తెలియజేశాయి. 1959 ఫిబ్రవరి 11వ తేదీన మయూర్ భంజ్ జిల్లాలోని బరిపదలో మిహిర్ దాస్ పుట్టారు. కష్టపడి హీరో అయ్యారు.
Also Read: సుకుమార్ కి విజయ్ దేవరకొండ చేసిన మెసేజ్ వైరల్ !
కాగా 1979లో విడుదలైన ఆయన తొలి కమర్షియల్ చిత్రం ‘మధుర విజయ్’ సూపర్ హిట్ అయింది. ఇక అప్పటి నుంచి ఆయన దశ పూర్తిగా తిరిగింది. స్టార్ హీరో అయ్యారు. ఓలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరో అయ్యారు. ఏది ఏమైనా తన అత్యుత్తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన మిహిర్ దాస్ ఇక లేరు అనగానే ఆయన అభిమానులు జీర్ణయించుకోలేకపోతున్నారు. ఎప్పటికీ ఒడిశా సినీ లోకంలో ఆయన స్థానం సుస్థిరంగానే ఉంటుంది.
కాగా మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున మిహిర్ దాస్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read: చిరుతో రవితేజ.. టికెట్ రేట్లు పై ఏపీ మంత్రులతో మాట్లాడతాడట