
Heroine Nagma: పాన్ ఇండియా లెవెల్ లో ఆరోజుల్లో ఫిలిం ఇండస్ట్రీ ని శాసించిన అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు నగ్మా.బాషా తో సంబంధం లేకుండా ప్రతీ ఇండస్ట్రీ లోను అగ్ర హీరోల సరసన నటించి, గొప్ప స్టార్ స్టేటస్ ని అనుభవించిన ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా, రాజకీయాల్లో బిజీ గా ఉంటుంది.కాంగ్రెస్ పార్టీ లో ఈమె యాక్టీవ్ గా ఎన్నో ఏళ్ళ నుండి పని చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈమె ఇప్పుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని డబ్బులను కోల్పోయి పోలీసులను ఆశ్రయించింది.ఎప్పటికప్పుడు పోలీసులు ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి మీ ఫోన్ కి వచ్చే స్పాం మెసేజిలను ఓపెన్ చెయ్యవద్దు అని చెప్తూనే ఉన్నారు.కానీ నగ్మా పొరపాటున తన ఫోన్ కి వచ్చిన మెసేజి బటన్ ని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ని చూసుకోకుండా క్లిక్ చేసింది.
ఆమె క్లిక్ చేసిన వెంటనే బ్యాంక్ కి సంబంధించిన ఏజెంట్స్ గా ఫోన్ సైబర్ నేరగాళ్లు నగ్మా కి ఫోన్ చేసారు.మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని,మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్తే మేమే చేసి ఇస్తామని అడిగారట.పాపం నగ్మా వాళ్ళని నమ్మి అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చెప్పేసింది.ఎప్పుడైతే ఆమె వివరాలు చెప్పిందో, అప్పుడే ఆమె వివరాలతో ఆన్లైన్ లో ఆ బ్యాంక్ తరుపున అకౌంట్ క్రియేట్ చేసి ఆన్లైన్ ద్వారా లక్ష రూపాయిలు పంపించుకున్నాడని నగ్మా ఈ సందర్భంగా పోలీసులకు తెలిపింది.

అతనికి డీటెయిల్స్ చెప్తున్న సమయం లో ఆమె ఫోన్ కి 20 సార్లు ఓటీపీ వచ్చిందని, కానీ నేను అది వాళ్లకి చెప్పకపోయినా కూడా డబ్బులు ఎలా కాజేసారో అర్థం కావడం లేదంటూ నగ్మా ఈ సందర్భంగా పోలీసుల ముందు వాపోయింది.అయితే లక్ష రూపాయిల చిన్న అమౌంట్ పొయ్యింది కాబట్టి సరిపోయింది, పెద్ద అమౌంట్ పొయ్యుంటే ఎంత బాధపడాల్సి వచ్చేదే అంటూ ఆందోళన వ్యక్తం చేసింది నగ్మా.