Faima Mother- Revanth: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి టాస్కులు ఆడడం లో కానీ..ఎంటర్టైన్మెంట్ పంచడం లో కానీ అందరికంటే ముందు ఉండే కంటెస్టెంట్ ఎవరు అంటే మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు రేవంత్..ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ గెలుచుకోబోయే కంటెస్టెంట్ కూడా అతనే..మొదటి వారం నుండి మొన్నటి వారం వరుకు నామినేషన్స్ లోకి ఎప్పుడు వచ్చినా కూడా అందరికంటే నెంబర్ 1 స్థానం లో ఉంటాడు రేవంత్..అతనికి వచ్చే ఓట్లలో మిగిలిన ఇంటి సబ్యులకు సగం కూడా రావు.

రేవంత్ లో అందరికి నచ్చేది మాస్కు వేసుకోకుండా ఆడడమే..మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్యడం..ఏది అనిపిస్తే అది మొహం మీదనే చెప్పేయడం రేవంత్ లో ఉన్న గొప్ప క్వాలిటీ..నటించడం అసలు చేతకాదు..ఈరోజు జరిగిన సంఘటన కూడా అందుకు అద్దం పట్టేలాగా కనిపించింది..ఈ వారం మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోకి వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.
నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఫైమా వాళ్ళ అమ్మ హౌస్ లోకి వస్తుంది..అందరితో బాగానే మాట్లాడుతుంది కానీ..రేవంత్ తో మాత్రం ‘ఆమ్మో నిన్ను చూస్తేనే భయం వేస్తుంది’ అని చెప్తుంది..దీనికి రేవంత్ చాలా హర్ట్ అయ్యాడు..అప్పటి వరుకు ఎంతో యాక్టీవ్ గా ఉంటూ వచ్చిన రేవంత్ ఎప్పుడైతే ఈ మాట ఆమె నోటి నుండి విన్నాడో..అప్పటి నుండి బాగా డల్ అయిపోయాడు..’సారీ..ఎదో జోక్ గా అన్నాను..నీకు నవ్వు రప్పించడానికోసం’ అని చెప్తుంది ఫైమా వాళ్ళ అమ్మ..అప్పుడు రేవంత్ పర్వాలేదు అనే ఎక్సప్రెషన్ పెట్టినా కూడా అతని ముఖం లో సీరియస్ నెస్ ని చూస్తే అర్థం అయిపోతుంది అతను ఆ మాటకి బాగా హర్ట్ అయ్యాడని.

శ్రీహాన్ సరదాగా ఫైమా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ‘ఎంత పెద్ద మాట అన్నారు అమ్మా..మీరు కనుక బిగ్ బాస్ హౌస్ లో ఉంటె ఈ వారం మిమల్ని కచ్చితంగా నామినేట్ చేసేవాడు రేవంత్’ అని అంటాడు..అలా జోక్ వేసినప్పుడు ఇంటి సభ్యులందరు నవ్వుతారు కానీ..రేవంత్ మొహం లో మాత్రం నవ్వు కనిపించడు..అతను నిజంగానే ఫైమా వాళ్ళ అమ్మ అన్న మాటలకు హర్ట్ అయ్యాడా..లేక తన ఫ్యామిలీ ని మిస్ అవుతున్నందుకు బాధపడుతున్నాడా అనేది చూసే ప్రేక్షకులకు కూడా అనుమానం కలిగింది.