Homeట్రెండింగ్ న్యూస్Tirupati Love Marriage: ఫేస్ బుక్ ప్రేమ పెళ్లి.. అతడి సావుకొచ్చింది..!

Tirupati Love Marriage: ఫేస్ బుక్ ప్రేమ పెళ్లి.. అతడి సావుకొచ్చింది..!

Tirupati Love Marriage: సోషల్‌ మీడియా పరిచయాలు కొన్నాళ్లుగా బంధాలుగా మారుతున్నాయి. కొన్ని అక్రమమైతే.. మరికొన్ని.. సంక్రమంగా వైవాహిక జీవితంలోకి వెళ్తున్నాయి. ఇటీవల కొన్ని సోషల్‌ మీడియా పరిచయాలు సరిహద్దులను కూడా దాటించాయి. ఇలాంటి తరుణంలో ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన యువతీ యువకులు కూడా ప్రేమలో పడ్డారు. పెళ్లితో ఏకం కావాలనుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, తర్వాతే అసలు కథ మొదలైంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుగా.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం.. యువకుడి కుటుంబం సావుకొచ్చింది.

ఆస్తి కోసం యువతి బంధువుల పట్టు..
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సీఎన్‌పేట గ్రామానికి చెందిన యనమల హరిబాబుకు ఫేస్‌బుక్‌లో నంద్యాల జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన సుకన్య పరిచయమైంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని రెండు నెలల కిందట వివాహం చేసుకున్నారు. 20 రోజులు ఇద్దరూ అక్క ఇంట్లో ఉన్నారు. అనంతరం ఇంటికి వచారు. వారితో యువతి కుటుంబ సభ్యులు అతడి ఆస్తి పాస్తులు యువతికి రాయాలని పట్టుబట్టారు.

కుదరదన్నందుకు దాడి..
ఆస్తి యువతి పేరిట రాయడం కుదరదని యువకుడి బంధువులు స్పష్టం చేశారు. ఆస్తి కోసం పట్టు పట్టడం ఏంటని నిలదీశారు. ఇద్దరు కలిసి ఉండాలని కోరుకోవాల్సిన యువతి బంధువులు ఆస్తి అడగడం యువకుడి కుటుంబానికి అనుమానం తెప్పించింది. ఆస్తి కోసమే పెళ్లి చేసుకుందా అని అనుమానం రావడం సహజం. యువకుడికి తమ్ముడు ఉండటంతో ఆస్తి రాయడం కుదరదని చెప్పారు. దీంతో యువతి బావ గురవయ్య, తండ్రి ఈశ్వర్‌ మరికొందరితో రాడ్లు, కర్రలతో వచ్చి మంగళవారం దాడికి పాల్పడ్డారు. యువకుడి తల్లి కోటమ్మను కొట్టి కారులో ఎక్కించేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్న హరిబాబును రాడ్లతో కొట్టారు. అడ్డుకున్న కొందరికి గాయాలు కాగా స్థానికులు తిరగబడటంతో వారు వెళ్లిపోయారు.

ప్రేమా.. మోసమా…
ఫెస్‌బుక్‌ పరిచయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లిన ఆ జంటకు ఇప్పుడు ఏమీ అర్థం కావడం లేదు. తమది ప్రేమా.. లేక యువతి తనను మోసం చేసిందా అని హరిబాబు ఆందోళన చెందుతున్నాడు. కలిసి జీవిద్దామనుకుంటే.. ఇలా అయిందేంటని యువతి కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ యువతిది ప్రేమో మోసమో అర్థం కాక హరిబాబు తల పట్టుకుంటున్నాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular