America Watermelons: వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే పండ్లల్లో పుచ్చకాయ ముందుంటుంది. ఎన్నో పోషకాలున్న పుచ్చకాయను 5 వేల ఏళ్ల కిందటే కనుక్కున్నట్లు కొన్ని పుస్తకాల ద్వారా తెలుస్తోంది. ఒకప్పుడు పుచ్చకాయకు డిమాండ్ ఉండడంతో వాటిని దక్కించుకున్నారు దాచుకునేవారట. అమెరికన్లు దీనిని 17వ శతాబ్దంలో పరిచయం చేసినట్లు చెబుతున్నారు. ఎక్కువగా వేసవిలో వచ్చే పుచ్చకాయ కాల క్రమంలో సాధారణ రోజుల్లో కూడా లభ్యమవుతుంది.
నేచురల్ గా లభించే పుచ్చకాయను పోషకాలమయం అని అంటారు. ఇందులో బి విటమిన్లు, పోటాషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా లభిస్తాయి. బి విటమిన్లు శరీరానికి అందిస్తే పోటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే పుచ్చకాయ తినాలని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. వేడికి కమిలిన చర్మంపై కూడా పుచ్చకాయను ఉంచడం వల్ల చర్మం నిగారింపుగా మారుతుంది.
పుచ్చకాయలో ఎన్నో ఆరోగ్య గుణాలు ఉండడం వల్ల దీనికి దేశ, విదేశాల్లో డిమాండ్ ఉంటుంది. దీనిని అమెరికాలో కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే ఇటీవ అమెరికాలో ఉండే పుచ్చకాలు పేలుతున్నాయి. రివాల్వర్ తో కాలిస్తే పుచ్చకాయ ఎలా పేలుతుందో అలాగే పేలుతుండడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అందుకు కారణం అందులో ఉండే బ్యాక్టీరియా ఉండడమే. అంతేకాకుండా ఉష్ణోగ్రత అధికంగా ఉన్న చోట ఉంచడం వల్ల ఇలా పేలుతుందని కొందరు అంటున్నారు.
అమెరికాలోని ఓ సంస్థ అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయలో సహజ చక్కెర, ఈస్ట్ అనే పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని అధిక ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుందట. దీంతో ఒక్కసారిగా పేలినట్లు అవుతాయని తెలిపింది. కార్నెల్ లోని స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్ ప్రోఫెస్ మాట్లాడుతూ పుచ్చకాయలు పేలిపోవడానికి బ్యాక్టీరియా లేదా ఫంగస్ అని తెలిపారు.