
Nani Dasara Movie: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘దసరా’ ఈ నెల 30 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పాటలకు కూడా అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.నాని కూడా అనేక సందర్భాలలో ఈ చిత్రం అద్భుతంగా వచ్చిందనీ,కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో మన టాలీవుడ్ నుండి రాబోతున్న మరో సెన్సేషనల్ మూవీ అని చెప్పుకుంటూ వచ్చాడు.
దీనితో విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ చిత్రం పై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అదే సమయం లో మూవీ టీం లో టెన్షన్ కూడా నెలకొంది. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న అంశం చాలా సున్నితమైనది. దానిని ఆడియన్స్ సరైన పద్దతిలో రిసీవ్ చేసుకుంటారా లేదా అనే టెన్షన్ టీం అందరిలోనూ ఉంది.
అందులోనూ ఇది నాని కి మొట్టమొదటి మాస్ రోల్. ఇన్ని రోజులు యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ మరియు ఫామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమాలు చేసిన నాని ఒక్కసారిగా ఇంత మాస్ రోల్ లో ఊహించుకోవడం కష్టమే. నాని కి ఇది పెద్ద పరీక్ష,ఆయన సినిమా ప్రారంభం నుండే ఆడియన్స్ ని తన రోల్ కి కనెక్ట్ అయ్యేలా చెయ్యాలి. ఇది పెద్ద సవాలే, ఇక కీర్తి సురేష్ కూడా ఈ చిత్రం తన కెరీర్ లో నటన పరంగా మరో మహానటి రేంజ్ లో నిలిచిపోతుంది అనే నమ్మకం తో ఉండి.

ఈమధ్య కాలం లో ఆమె ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేసింది కానీ, ఎప్పుడూ కూడా తన పాత్ర ని ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానం కోసం ఎదురు చూడలేదు. వీళ్ళ హైప్ మొత్తం చూస్తూ ఉంటే సినిమాలో నిజంగానే కంటెంట్ చాలా బలంగా ఉన్నట్టుంది. మూవీ టీం చెప్పినట్టు గానే ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టిస్తుందా లేదా అనేది చూడాలి.