Homeఎంటర్టైన్మెంట్Mohan Babu: అన్నదమ్ముల గొడవలతో అంతా నాశనం... ఫైనల్ గా ఓపెన్ అయిన మోహన్ బాబు!

Mohan Babu: అన్నదమ్ముల గొడవలతో అంతా నాశనం… ఫైనల్ గా ఓపెన్ అయిన మోహన్ బాబు!

Mohan Babu
Mohan Babu

Mohan Babu: మంచు బ్రదర్స్ మనస్పర్థల ఎపిసోడ్ ఇంకా ముగియలేదు. అది ఊహించని మలుపులు తీసుకుంటుంది. మనోజ్ కారణంగా మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తలెత్తాయనే పుకారు చాలా కాలంగా ఉంది. భూమా మౌనికతో మనోజ్ సన్నిహితంగా ఉండటం, ఆమెను పెళ్లి చేసుకుంటాను అనడం గొడవలకు కారణం అంటూ వార్తలు వెలువడ్డాయి. పుకార్లను బలపరిచే విధంగా మనోజ్-మౌనికల పెళ్లి జరిగింది. మోహన్ బాబు పట్టించుకోకపోవడంతో మంచు లక్ష్మి ముందుకు వచ్చారు.

అక్క మంచు లక్ష్మి నివాసంలో మూడు రోజుల పాటు మనోజ్ వివాహం ఘనంగా జరిగింది. విష్ణు ఈ పెళ్లికి దూరంగా ఉన్నారు. ఆయన వచ్చి వెళ్లిపోయారని కొందరు చెబుతున్నా ఒక్క ఫోటోలో కూడా క్యాప్చర్ కాలేదు. ఆయన సతీమణి, పిల్లలు కూడా కనిపించలేదు. మోహన్ బాబు మాత్రం ముహూర్తానికి కొన్ని నిమిషాల ముందు వచ్చారు. మనోజ్-మౌనికలను ఆశీర్వదించి వారితో ఫోటోలు దిగారు. ఈ సంఘటనల తర్వాత మనోజ్ పోస్ట్ చేసిన వీడియో సంచలనమైంది. మనోజ్-విష్ణులు గొడవ పడుతున్న ఆ వీడియో వైరల్ అయ్యింది.

ఈ వివాదం మీద విష్ణు స్పందించారు. మనోజ్ వయసులో చిన్నవాడు. ఆవేశంలో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీన్ని బూతద్దంలో చూడాల్సిన పనిలేదంటూ… వివరణ ఇచ్చారు. మంచు లక్ష్మి కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు. దీన్ని ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవగా చూడాలి. త్వరలోనే పరిష్కారం అవుతుంది. కొందరు ఏమీ తెలియకుండా నిరాధార కథనాలు రాస్తున్నారని… ఆమె అసహనం వ్యక్తం చేశారు.

Mohan Babu
Mohan Babu

షాకిస్తూ ఇదంతా జస్ట్ ఫ్రాంక్, ‘హౌస్ ఆఫ్ మంచూస్” టైటిల్ తో ఓ రియాలిటీ చేస్తున్నాం. దానిలో భాగంగా గొడవ పడుతున్నట్లు నాటకం ఆడాము అని అర్థం వచ్చేలా విష్ణు ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే మోహన్ బాబు దీనిపై తాజాగా స్పందించారు. విష్ణు-మనోజ్ ల మధ్య గొడవేంటని అడగ్గా… మహాభారతంలో కూడా అన్నదమ్ములు గొడవ పడ్డారు. సాధించింది ఏం లేదు. మొత్తం కోల్పోయారు. వివాదాల వలన ఒరిగేది ఏముండదు. మానసిక ప్రశాంత పోతుంది. ఒక్కోసారి ఇలా జరగకపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. బాధేస్తుంది. వివాదాలు, మనస్పర్థలు రావని చెప్పలేం. అవి ఎందుకు వస్తారో అర్థం కాదు.. అన్నారు. ఆయన మాటలను బట్టి గొడవ నిజమే అనిపిస్తుంది. విష్ణు మాత్రం మా మధ్య విబేధాలు లేవని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper
Exit mobile version