
Anasuya Bharadwaj: అనసూయ సోషల్ మీడియా ఫ్రీక్. తనకు సంబంధించిన చాలా విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఆ విధంగా తన ఫ్యాన్స్ కి ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. అదే సమయంలో ఎవరైనా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే తిరిగి ఇచ్చి పడేస్తుంది. వాలెంటైన్స్ నాడు భర్తతో పాటు ఓ రొమాంటిక్ ఫోటో దిగి ఇంస్టాగ్రామ్ లో పెట్టారు. ‘నీతో లైఫ్ రోలర్ కోస్టర్ రైడ్, హ్యాపీ వాలెంటైన్స్ డే’ అంటూ కామెంట్స్ చేశారు. అనసూయ పోస్ట్ పై ఒక నెటిజన్ వివాదాస్పద కామెంట్ పెట్టాడు. ‘అదంతా ఏం లేదులే అక్కా వాడి దగ్గర బాగా డబ్బుంది, దట్స్ ఇట్’ అని అనసూయ భర్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
నెటిజన్ కామెంట్స్ తో అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. బావను పట్టుకొని వాడు వీడు ఏంట్రా మర్యాద లేకుండా, ఏం పెంపకంరా నీది. మాట్లాడటం నేర్చుకో లేదంటే చెప్పుతో కొట్టి నేర్పుతా అంటూ… ఫైర్ అయ్యింది. అతనితో వాగ్వాదానికి దిగింది. అనసూయ మీద సోషల్ మీడియా నెగిటివిటీ గట్టిగానే ఉంటుంది. ఎంత మంది ఏమన్నా అనసూయ కూడా తగ్గదు. కొంతమందిని అనసూయ అరెస్ట్ చేయించడం విశేషం . ఆ మధ్య ఎక్కడో గోదావరి జిల్లాకు చెందిన ఒక యువకుడు అసభ్యకర పోస్ట్స్ పెడుతున్నాడని కంప్లైంట్ చేసింది.
పోలీసులు ఆ కుర్రాడిని పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కి తరలించారు. అమ్మాయిలకు ఆ మాత్రం ఆత్మవిశ్వాసమైతే ఉండాలి. ఇక అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. ఆమె పూర్తిగా టెలివిజన్ కి దూరమయ్యారు. మొదట జబర్దస్త్ వదిలేసిన అనసూయ మెల్లగా ఒక్కో షోకి గుడ్ బై చెబుతూ వచ్చారు. నటిగా ఆఫర్స్ వస్తున్న తరుణంలో ఆమె యాంకరింగ్ మీద ఆసక్తి వదిలేశారు.
ప్రస్తుతం అనసూయ పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. పుష్ప 2తో పాటు రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారు . దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండలో అనసూయ ప్రెగ్నెంట్ ఉమన్ గా నటించడం విశేషం. అనసూయ రంగమార్తాండ చిత్రంలోని తన లుక్ లీక్ చేశారు. ఆ ఫోటోలు చూశాక రంగమార్తాండలో ఆమె పాత్రపై ఆసక్తి రెట్టింపు అయ్యింది. వీటితో పాటు కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారని సమాచారం.

కాగా ఆమె లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. చిమ్మ చీకటిలో ఒంటరిగా ఉన్న అనసూయ ఫోటో చూసి జనాలు మదనపడుతున్నారు. ఆ చీకటి ప్రదేశంలో అనసూయ ఒక్కటే ఏం చేస్తున్నారని వాపోతున్నారు. అనసూయ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. నెటిజన్స్ ఆమె ఫోటోపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.