Eesha Rebba: తెలుగు అమ్మాయిలు పరిశ్రమను ఏలి దశాబ్దాలు గడిచిపోతుంది. విజయశాంతి, రమ్యకృష్ణ,రంభ,రోజాతోనే ఆ వైభవం ముగిసింది. ముంబై హీరోయిన్స్ ట్రెండ్ మొదలయ్యాక దర్శకులు తెలుగు అమ్మాయిల ముఖం చూడటం లేదు. దర్శక నిర్మాతలకు పొరుగింటి పుల్లకూరే నచ్చుతుంది. నటన, భాష రాకపోయినా నేర్పించి ఎదురు కోట్లు రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారు. అన్నీ తెలిసిన తెలుగు అమ్మాయిలు అరాకొరా డబ్బులకు చేస్తామన్న నిర్మాతలు, దర్శకులు పట్టించుకోవడం లేదు. పొరుగింటి పుల్లకూరే రుచి అంటున్నారు.

కన్నడ, మలయాళ భామలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా తెలుగు హీరోయిన్స్ కి ఇవ్వడం లేదు. దీంతో ఈషా రెబ్బా లాంటి లోకల్ టాలెంట్ కి ఆదరణ దక్కడం లేదు. మాకేం తక్కువ… కావాలంటే ముంబై భామల్లా పొట్టి బట్టలో స్కిన్ షోకి కూడా సిద్దమే అంటున్నారు. అయినా మీరు మాకొద్దని ముఖాన చెప్పేస్తున్నారు. ప్రాధాన్యం లేని సెకండ్ హీరోయిన్, కెరీర్ కి ఉపయోగపడని వ్యాంప్ రోల్స్ కే పరిమితం చేస్తున్నారు.
వరంగల్ లో పుట్టి పెరిగిన ఈషా రెబ్బా కెరీర్ ముగిసినట్లే అనిపిస్తుంది. ఆమె టాలీవుడ్ వివక్షతకు బలయ్యారు. చేసేది లేక ఇతర పరిశ్రమలపై కన్నేసింది. ప్రస్తుతం తమిళంలో ఒక మూవీ చేస్తున్న ఈషా అక్కడ అదృష్టం పరీక్షించుకోనున్నారు. తెలుగులో ఆమె చేతిలో ఒక్క ఆఫర్ లేదు. 2021లో విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం తర్వాత ఈషా సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఆ మూవీలో ఈషాది వ్యాంప్ రోల్.

కెరీర్ బిగినింగ్ లో ఈషాకు వరుస ఆఫర్స్ వచ్చాయి. స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషాను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పర్లేదు అనిపించుకుంది. అయితే హ్యాపీ డేస్ మాదిరి నటులకు బ్రేక్ ఇవ్వలేదు. ఈషా హీరోయిన్ గా నటించిన ‘అంతకు ముందు ఆ తర్వాత’, అమీ తుమీ, ‘అ’ వంటి చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఎలాగైనా దర్శక నిర్మాతలను ఆకర్షించేందుకు సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తుంది. ఈషా బోల్డ్ ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా జిమ్ ఫిట్ లో ఈషా టూ మచ్ హాట్ గా కనిపించారు.