Emmanuel- Varsha: జబర్దస్త్ ఇమ్మానియేల్ మామూలోడు కాదు. తన లవర్ వర్షకు ఖరీదైన బహుమతి గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. బుల్లితెర వేదికగా ఇమ్మానియేల్-వర్ష మధ్య ఒక లవ్ ట్రాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మనోడు ఆమె మెడలో తాళి కూడా కట్టాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వర్ష ఒప్పుకుంటే ఈ క్షణం ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు. గెటప్ శ్రీను వేదికపైకి తాళిబొట్టు తేగా… ఇమ్మానియేల్ అన్నంత పని చేశాడు. వర్షకు తాళిబొట్టు కట్టాడు. వర్ష దీనికి పూర్తి సమ్మతం తెలపడం విశేషం. ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఆనందంగా ఇమ్మూతో తాళి కట్టించుకుంది.

ఇదంతా హైప్ కోసమే కావచ్చు. స్కిట్ లో కాకుండా ఆఫ్ ది స్కిట్ వర్ష మెడలో ఇమ్మానియల్ తాళి కట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా ఇమ్మానియేల్ చేసిన మరొక పని వార్తలకు ఎక్కింది. ఆమెకు ఖరీదైన బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలో వర్ష బర్త్ డే అట. దాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ప్రముఖ ఆభరణాల షాపుకు వర్షను తీసుకుపోయాడు. అక్కడ ఉన్న ఖరీదైన ఆభరణాలను కొని బహుమతిగా ఇచ్చాడు. ఈ వీడియో ఇమ్మానియేల్ తన యు ట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశాడు.
అయితే ఇది ఒక ప్రమోషనల్ వీడియో అని తెలుస్తుంది. పంజాగుట్ట వద్ద ఇమ్మడి పేరుతో ఒక సిల్వర్ గోల్డ్ షో రూమ్ ఉంది. ఆ షాప్ కి వెళ్లిన ఇమ్మానియేల్, వర్ష కలెక్షన్స్ మొత్తం చూశారు. షాపు ఓనర్ వాళ్లకు కలెక్షన్స్, మోడల్, ప్రైసెస్ గురించి వివరించారు. కాగా వర్ష కోసం ఇమ్మానియేల్ ఖరీదైన హారం కొన్నాడ. ఈ వీడియో వైరల్ కావడంతో పాటు వర్షకు ఇమ్మానియేల్ నగలు కూడా కొంటున్నాడా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరి ప్రేయసి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి.

వర్ష రాకతో ఇమ్మానియేల్ టైం మారిపోయింది. వర్ష-ఇమ్మానియేల్ కాంబినేషన్ లో వచ్చిన స్కిట్స్ వర్క్ అవుట్ కాగా జబర్దస్త్ లో ఇమ్మానియేల్ మెయిన్ కమెడియన్స్ లో ఒకరిగా మారారు. వర్ష లవర్ అన్న ట్యాగ్, వారిద్దరి కెమిస్ట్రీ, రొమాన్స్ అతన్ని పాప్యులర్ చేసింది. ఈ మధ్య ఇమ్మానియేల్ కారు కూడా కొన్నాడు. అదే సమయంలో వర్షకు కూడా ఇమ్మానియేల్ వలన లైఫ్ వచ్చింది. ఏళ్ళుగా సీరియల్స్ చేస్తున్నా రాని గుర్తింపు జబర్దస్త్ తో వర్షకు దక్కింది. ఇమ్మానియేల్ అంటే చచ్చేంత ప్రేమని ఓపెన్ గానే చెప్పే వర్ష బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా వంటి కామెడీ షోస్ లో సందడి చేస్తూ దూసుకుపోతున్నారు.