Elephant Fight Video: ఏనుగు ప్రశాంతతకు మారుపేరు. తినే తిండి దగ్గర నుంచి తాగే నీరు వరకు అన్నింటిలోనూ ఒక పద్ధతిని అవలంబిస్తుంది. తిక్క రేగితే తొండంతో జాడిచ్చి కొడుతుంది. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే.. ఏనుగు ఘీంకారం ఎలా ఉంటుందంటే నాలుగు దిక్కులు పిక్కటిల్లుతాయి. ఆ శబ్దానికి అరణ్యం కూడా వణికి పోతుంది. రెండు పులులు లేదా సింహాలు పోట్లాడుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. రెండు ఏనుగులు పరస్పరం ఢీకొంటే మాత్రం పరిస్థితి చాలా భయానకంగా ఉంటుంది. అటువైపుగా ఎవరైనా వెళితే ఇక అంతే సంగతులు. కేరళ రాష్ట్రంలో ఇలానే చాలామంది మావటిలు కన్నుమూశారు.
సోషల్ మీడియాలో వైరల్
దట్టమైన అడవిలో నడిరోడ్డు మీద రెండు ఏనుగులు కొట్టుకుంటున్న తీరు ఇప్పుడు సామాజిక మద్యమాల్లో వైరల్ గా మారింది.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంతా నందా ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో చూపించిన దాని ప్రకారం రోడ్డు మధ్యన రెండు గజరాజులు పరస్పరం పోట్లాడుకుంటున్నాయి. దిగ్గజ జంతువులు కావడంతో, దిక్కులు పిక్కటిల్లే విధంగా అరుపులు అరుస్తూ తొండాలతో పరస్పరం కొట్లాడుకుంటున్నాయి. అటు సమీప ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో భారీగా ప్రాణనష్టం తప్పింది. లేకుంటే ఏనుగులు ఆ కోపాన్ని మనుషుల మీద చూపించేవి.. దెబ్బకు ప్రాణ నష్టం సంభవించేది. దట్టమైన అడవి కావడంతో అటువైపుగా ఎవరు వెళ్ళలేదని తెలుస్తోంది. దండకారణ్యం కావడం, సాయంత్రం కావడంతో పోలీసులు అటువైపుగా వాహనాలను అనుమతించలేదని తెలుస్తోంది.
అడవి వణికిపోయింది
గజరాజుల పోరాటంతో అడవి మొత్తం వణికిపోయిందని సుశాంతా నందా క్యాప్షన్ ఇచ్చారు. ఏనుగులు ఒకదానిని ఒకటి తోసుకుంటూ బాహా బాహీకి దిగాయని ఆయన వ్యాఖ్యానించారు.. సాధారణంగా ఆహార అన్వేషణలో ఇబ్బంది ఏర్పడినప్పుడు ఏనుగులు పోట్లాడుకుంటాయని జంతు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పురుష ఏనుగు శృంగారసంకేతాలు ఇస్తే స్త్రీ ఏనుగు స్పందించనప్పుడు ఇలానే పోట్లాడుకుంటాయని వారు చెబుతున్నారు. అలాంటప్పుడు అటువైపుగా ఎవరూ వెళ్లకపోవడమే మంచిదని వారు వివరిస్తున్నారు. ఇక ఈ వీడియో మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఈ ప్రమాదకర సన్నివేశాన్ని ఎవరు రికార్డు చేశారో తెలియదు కానీ, వారికి హ్యాట్సాఫ్ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఏనుగుల ఫైట్ చూసేందుకు భీకరంగా ఉందని కొందరు, అడవి మీద ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఏనుగులు పరస్పరం ఢీకొట్టుకుంటున్నాయని మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది.
When the titans clash,
The Forest shivers…. pic.twitter.com/GGnpUUlhTS— Susanta Nanda (@susantananda3) May 16, 2023