Homeట్రెండింగ్ న్యూస్E Flyng Taxi: బెంగళూరులో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తొలగినట్లే..

E Flyng Taxi: బెంగళూరులో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తొలగినట్లే..

E Flyng Taxi: దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోయిందని తెలిసిందే కదా.. గత లెక్కల ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా జనాభా కలిగిన దేశం భారతదేశం. అవును చైనాను ఎప్పుడో దాటి పోయాం కూడా.. జనాభా పెరుగుతుంది కానీ.. భూమి పెరగడం లేదు కదా.. అందుకే ట్రాఫిక్ కష్టాలు తీరడం లేదు.. ఇప్పటికే అడవులు, కొండలు, గుట్టలను కనిపించకుండా చేసినా కూడా పెద్ద పెద్ద సిటీల్లో మాత్రం కాలు తీసి కాలు వేయాలంటే కష్టంగానే మారుతుంది. దీంతో నగరాల్లో నివసించే వారికి గంటల నుంచి రోజుల వరకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. వీటిని పరిష్కరించేందుకు ఫ్లయింగ్ టాక్సీలపై ప్రయోగాలు చేశారు. అవి సక్సెస్ కావడంతో ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, సరళ ఏవియేషన్ అండ్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (BIAL) సహకారంతో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను రూపొందించింది. ఈ వినూత్న ఫ్లయింగ్ టాక్సీ సెవెన్ సీటర్ గా ఉంటుంది. eVTOL (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) విమానాలు వేగవంతమైన, పర్యావరణ అనుకూల రవాణాను అందించేందుకు ఉపయోగపడతాయి. భారతదేశంలోని కీలక నగరాల్లో ఖర్చుతో కూడుకున్న అర్బన్ ఎయిర్ మొబిలిటీ సొల్యూషన్‌ను అందించడంతోపాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఊహించిన మార్గాల్లో బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీకి వేగవంతమైన ప్రయాణం, ప్రయాణికులకు వేగవంతమైన, పచ్చటి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టేందుకు బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అర్బన్ ఎయిర్ మొబిలిటీలో భవిష్యత్తులో కీలకంగా మారేందుకు సిద్ధంగా ఉంది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇంకా రెండు నుంచి మూడేళ్లు పడుతున్న నేపథ్యంలో సరళ ఏవియేషన్ అందుకు సిద్దం చేస్తుంది. అడ్రియన్ ష్మిత్, రాకేష్ గాంకర్, శివమ్ చౌహాన్ సహ-స్థాపన చేసిన సరళ ఏవియేషన్ ఎయిర్ మొబిలిటీలో ముందంజలో ఉంది.

సరళ ఏవియేషన్ దేశంలో అత్యంత నాలుగు నగరాల్లో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను పరిచయం చేసేందుకు సిద్ధం అవుతోంది అందులో బెంగళూర్, ముంబై, ఢిల్లీ, పుణె. ఈ సంస్థ వినూత్న సేవ ప్రయాణికుల కోసం ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉదాహరణకు, బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీకి ప్రతిపాదిత మార్గం విమానంలో కేవలం 19 నిమిషాలు పడుతుంది, ఇది రోడ్డు మార్గంలో 152 నిమిషాలు పడుతుంది. ప్రయాణికులు ఈ అనుకూలమైన, సమర్థవంతమైన విమాన ప్రయాణం చేసేందుకు రూ. 1,700 వరకు చెల్లించవచ్చు. దీని వలన సమయం ఆదా అవుతుంది.

బెంగళూర్ లో eVTOL ఎయిర్‌క్రాఫ్ట్‌ను పరిచయం చేసేందుకు సరళ ఏవియేషన్‌ సిద్ధంగా ఉంది. బెంగళూర్ ట్రాఫిక్ సవాళ్లను పరిష్కరించేందుకు వీటి వినియోగం ఎంతో అవసరం. సరళ ఏవియేషన్ తన eVTOL ఎయిర్‌క్రాఫ్ట్‌తో నూతన ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తూ.. అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా స్థిరపడింది. సంస్థ వేగవంతమైన, సమర్థవంతమైన విమాన ప్రయాణాన్ని అందిస్తుంది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular