
Hyper Aadi Assets: జబర్దస్త్ ప్రొగ్రాం ఎంతో మంది జీవితాలను నిలబెట్టింది. ఈ షో కు రాకముందు చాలా మంది సాధారణ స్థితిలో ఉన్నవాళ్లు.. ఆ తరువాత కోటీశ్వరులయ్యారు. మరి కొందరు భారీగా ఆస్తులు సంపాదించారు. కొందరు ఇందులో పనిచేసిన వాళ్లు ఇతర చోట్ల అవకాశాలు రావడంతో జబర్దస్త్ ను వదిలేశారు. కానీ మరికొందరు మాత్రం జబర్దస్త్ దైవం లాంటిదంటూ అందులోనే కొనసాగుతున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు.
పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకేనే ఆది స్కిట్ అంటే నచ్చని వారుండరు. ఆయన పంచ్ లు ఏ సైడ్ నుంచి వస్తాయో తెలియని పరిస్థితి. అభి ద్వారా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తన టాలెంట్ తో టీం లీడర్ స్థాయికి ఎదిగారు. ఆ తరువాత పలు సినిమాల్లో కమెడియన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరుణంలో హైపర్ ఆది భారీగా ఆస్తులు సంపాదించారు. ఆ ఆస్తుల విలువ ఎంతో చూద్దాం..
ప్రకాశం జిల్లాకు చెందిన హైపర్ ఆది 1990లో చీమకుర్తిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. కుటుంబం కష్టాల్లో ఉండగానే ఆది బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత సాప్ట్ వేర్ జాబ్ చేస్తూ బజర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన జబర్దస్త్ ప్రొగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి రూ.20 లక్షల అప్పు అయినట్లు తెలిపాడు. ఆయన చదువుకునేటప్పుడు చాలా ఖర్చులు అయ్యాయని పేర్కొన్నాడు.

అయితే జబర్దస్త్ లోకి వచ్చిన తరువాత ఆది జీవితం మారిపోయింది. స్కిట్ కమెడియన్ నుంచి టీం లీడర్ వరకు ఎదిగారు. అలాగే పలు సినిమాల్లో అవకాశం రావడంతో ఆయన ఆస్తులు పెరిగిపోయాయి. తన చదువు కోసం సొంత ఊరిలోని భూమిని అమ్మేయగా.. ఇప్పుడు అదే గ్రామంలో 16 ఎకరాలు కొనుగోలు చేశారని అంటున్నారు. అంతేకాకుండా ఆయన తండ్రికి 10 చేతి వేళ్లకు 10 ఉంగరాళ్లను చేయించి ఇచ్చారట. అలాగే జూబ్లిహిల్స్ లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు